కాలసర్ప దోషం 
రాహు కేతువుల మధ్య అన్ని గ్రహములు ఉండి పోవుటయే కాలసర్ప దోషము ఇవి కొంత మంది  కొన్ని రకములుగా అన్వయించినారు వాటిలో ముఖ్య మైనవి  1  కాలసర్ప దోషము  2 అపసవ్య కాలసర్పదోషము  3  మారణ మాలా కాలసర్పదోషము  4 శేషనాగ కాలసర్ప దోషం .
వీటి వల్ల జాతకులకు 45  సంవస్చరములకు  గానీ వివాహము కాకుండుట మరియు కుటుంబ కలహాలు,దీర్ఘ రోగాలు,వ్యాపారసమస్యలు ,ముఖ్యముగా పిల్లలు కలుగ కుండుట లేదా పిల్లలకు సమస్యలు, ఆర్దికముగా నష్టము ఇటువంటివి  జరుగుతుండును....వారియొక్క దోషమును బట్టి నివారణ ఉపాయములు[remides] కలవు ..సంప్రదించండి ..9866193557 .  



                                     కుంకుమ ధారణ ఎందుకు ?
కనుబొమల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకోవడం హైందవ సంప్రదాయం. ఇంటికి వచ్చిన ఏ ముత్తయిదువకైనా బొట్టుపెట్టి పంపడం మన ఆచారం. పాపిడ నడుమ ధరించే ఈ సిందూరం పెళ్లయిందని చప్పడానికి ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందువల్లనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన, పాపిట మధ్యలో ధరిస్తారు. 
ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీ శక్తి చిహ్నంగా కూడా సిందూరాన్ని పరిగణిస్తారు. ఎర్రటి రంగు ఆమె ప్రవేశంతో సంపద చేకూర్చుతుందనీ, స్త్రీ ధరించే సిందూరం కుటుంబ సంక్షేమాన్ని, సంతానాన్ని పరిరక్షిస్తుందని విశ్వాసం.
పురుషులు కూడా నుదుట తిలకం ధరించే సంప్రదాయం ఉంది. ఏదైనా మత సంబంధిత కార్యక్రమాలకు, పెళ్లిళ్లవంటి శుభకార్యాలలో ఈ విధంగా తిలకం ధరిస్తారు. మత సంబంధిత సందర్భాలలో వారు తమ కొలిచే దైవాన్ని అనసరించి తిలకం ఆకృతి ఉంటుంది. 
విష్ణు భక్తులు "U" ఆకృతిలో తిలకం పెట్టుకుంటే, శైవ భక్తులు మూడు అడ్డగీతలతో దిద్దుకుంటారు. బొట్టు పెట్టుకునే చోట అగ్యచక్ర లేదా ఆధ్యాత్మిక లేదా మూడో నేత్రం ఉంటుందని చెపుతారు. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకేచోట కేంద్రీకరించే బిందువు ఇది. 
ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్ట శక్తులు దరిచేరకుండా సంరక్షిస్తుందని విశ్వాసం.
రుద్రాక్షలు
శివుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు  జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారి వాటికి  కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి.ఋషులు,మునులు,రాక్షసులు మరియు దేవతలు అందరూ వీటిని ధరించువాఋ అనీ పురాణాది ఇతిహాసములలో తెలుయుచున్నది.. ఇప్పటికీ స్వాములు,బ్రాహ్మణులూ,పూజారులు,దైవజ్ఞులు,గురువులు మొదలగువారు వారు వీటిని ధరిస్తూవుంటారు.మరయు పుజగ్రుహములలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ వుంటారు.
వీటిలో చాల రకముల రుద్రాక్షలు వున్నాయి ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను కలిగి వుంటాయి. ఇవి ఒకటి నుంచి పదిహేను పద్దెనిమిది రకముల వరకూ వుండు అవకాశమున్నది.
1.  ఏఖ ముఖి  ఇది అత్యంత విలువ కలిగినది దీనిని ప్రత్యక్ష శివుని రూపముగా భావించుతారు.
2.  ద్విముఖి  ఇది అర్ధనారిస్వరులు [శివ పార్వతులు] గా భావిస్తారు.
3.  త్రి ముఖి దీనిని శివ,విస్ట్నుభ్రహ్మ, రూపముగా భావిస్తారు.
4.  చతుర్ ముఖి దీనిని బ్రహ్మ స్వరూపమని కొందరు చతుర్ వేదాల స్వరూపమని కొందరు భావిస్తారు.
5.  పంచ ముఖి  దీనిని పచముఖ రూపముగా లక్ష్మి స్వరూపముగా భావిస్తారు.
6.  షణ్ముఖి ఇది ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు.
7. సప్త ముఖి  కామధేను స్వరూపము గా భావిస్తారు.
8.  అష్ట ముఖి గణనాధుని[విఘ్నేశ్వర] స్వరూపముగా భావిస్తారు.
9.  నవముఖి నవగ్రహస్వరూపముగానె కాక ఉపాసకులకు మంచిదని భావిస్తారు
10.దస ముఖి దీనిని దశావతార రూపముగా విశేసించి స్త్రీలు వీటిని ధరిచుట మంచిదని భావించుట జరుగుతున్నది.  
మేష లగ్నం,మేష రాశి వారికి,మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుద్రాక్ష గాని,"1","3","5"ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును."పగడంస్టోన్"ధరించవచ్చును.
వృషభ లగ్నం వారికి,రాశి వారికి ,భరణి,పుబ్బ ,పూర్వాషాడ నక్షత్రాల వారికి "6" ముఖాల రుధ్రాక్ష గాని, "4","6","7" ముఖాలు కలిగిన రుధ్రాక్షలు గాని కవచం లాగ థరించ వచ్చును."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును.
మిథున లగ్నం వారికి ,రాశి వారికి ,ఆశ్లేష ,జ్యేష్ట ,రేవతి నక్షత్రాల వారికి "4" ముఖాల రుధ్రాక్ష గాని,"4',"6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును..
కర్కాటక లగ్నం వారికి ,రాశి వారికి, రోహిణి,హస్తా ,శ్రవణం, నక్షత్రాల వారికి "2"ముఖాల రుధ్రాక్ష గాని ,"2","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును."ముత్యం స్టోన్"ధరించ వచ్చును.

సింహా లగ్నం వారికి,రాశి వారికి, కృత్తిక,ఉత్తర ,ఉత్తరాషాడ నక్షత్రాల వారికి "1"ముఖం గాని, "1","3","5", ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."కెంపు స్టోన్"ధరించ వచ్చును.
కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి "4"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."ఆకుపచ్చ స్టోన్"ధరించ వచ్చును..
తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి"6"ముఖాల రుధ్రాక్ష గాని ,"4','6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.."డైమండ్ స్టోన్"ధరించ వచ్చును. 
వృశ్చిక లగ్నం వారికి, రాశి వారికి, మృగశిర,చిత్త్ర,థనిష్ట నక్షత్రాల వారికి "3"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"ముఖాల రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును.."పగడంస్టోన్"ధరించవచ్చును. .
థనస్సు లగ్నం వారికి, రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాధ్ర,నక్షత్రాల వారికి "5"ముఖాల రుధ్రాక్ష గాని "1",'3","5"ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును."కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.
మకర లగ్నం వారికి,రాశి వారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి "7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7",ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.
కుంభ లగ్నం వారికి, రాశివారికి,పుష్యమి,అనూరాధా,ఉత్తరాభాధ్ర నక్షత్రాల వారికి"7"ముఖాల రుధ్రాక్ష గాని,"4","6","7"ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును."నీలం స్టోన్"ధరించ వచ్చును.
మీన లగ్నం వారికి,రాశి వారికి,పునర్వసు,విశాఖ,పూర్వాభాథ్ర నక్షత్రాల వారికి"5"ముఖాల రుధ్రాక్ష గాని,"2","3","5"రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును.
"కనక పుష్యరాగం స్టోన్"ధరించ వచ్చును.
                            గ్రహముల వల్ల వచ్చు వ్యాదులు                                    
 రవి -  గుండె,జఠరము,లాలాజలము,తాపము,తలనెప్పి,కడుపుమంట,నేత్రములు,రక్త పోటు, మొదలగు వ్యాదులు.
 చంద్రుడు -  స్తనములు,రుతుక్రమ సంబిదిత,మానసిక,పిచ్చి మొదలగు వ్యాదులు.
 కుజుడు-కోపము,గుదము[మర్మస్థాన]కందరములు,ఎర్రకణములుపోవుట[పాడగుట],పేలుడు[మందుగుండు]సంబదిత,శస్త్ర చికిశ్చ మొదలగు వ్యాదులు.
 భుదుడు -  శ్వాస,మెడ గొంతు,ఫిట్స్,వెన్నెముక,నోరు మొదలగు వ్యాదులు.
 గురుడు  -  క్రొవ్వు,కాలేయము,మూత్రము,లివర్ సంబందిత వ్యాదులు.
 శుక్రుడు  -  మర్మము,మధుమేహము,సుఖ వ్యాదులు,గడవ బిళ్ళలు మొదలగు వ్యాదులు.
  శని  -  మూలవ్యాది,చాల రోజులు నిలిచే వ్యాదులు,పిసాచ బాధలు ,ఎముకలకు సంబందితవ్యాదులు.
 రాహువు -  క్షయ,అపరేషన్,కుష్టు,ప్రేగులు మొదలగు వ్యాదులు.
  కేతువు -  తెలియని జబ్బులు,నత్తి,నరముల పోటు మొదలగు జబ్బులు.
గ్రహస్థితి
జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు , లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు. స్త్రీ గ్రహములైన చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న బలము కలిగి ఉంటారు. పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి. నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము కలిగి ఉంటాయి. రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు, తెల్లవారు ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున శని సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు, చంద్రునికంటే సూర్యుడు బలవంతులు.
            ఈ సంవత్సరము గ్రహణములు 
ది. 01-06-2011 తేది భుద వారము సూర్య గ్రహణము -భారత దేసమునండు కనిపించదు కాబట్టి మనము [భారతదేసమువారు] ఏనియమములు పాటింప అవసరములేదు.
ది.15-06-2011 తేది భుద వారము  సంపూర్ణ చంద్ర గ్రహణము ఇది మన భారత దేసమునాడు కనిపించును.
ది.01-07-2011 తేది శుక్ర వారము  సూర్య గ్రహణము -భారత దేసమునండు కనిపించదు కాబట్టి మనము [భారతదేసమువారు] ఏనియమములు పాటింప అవసరములేదు.
ది.25-11-2011  తేది శుక్ర వారము  సూర్య గ్రహణము -భారత దేసమునండు కనిపించదు కాబట్టి మనము [భారతదేసమువారు] ఏనియమములు పాటింప అవసరములేదు.
ది.10-12-2011 తేది శని వారము  సంపూర్ణ చంద్ర గ్రహణము ఇది మన భారత దేసమునాడు కనిపించును.
ఈ సంవత్సరములో 5 గ్రహణములు సంభవించుట వలన అనేక ఉపద్రవములను ప్రజలు ఎదుర్కొనవలసి యుండును. ప్రజలు విలయినంతవరకు తగిన శాంతులు జరిపించుకొనుట శుభము.
 15-06-2011 వ తేది చంద్ర గ్రహణము జేష్ట,మూల[వృశ్చిక,ధనుస్సు]  వారికీ
 10-12-2011 వ తేది చంద్ర గ్రహణము  రోహిణి,మృగశిర[వృషభ రాసి] వారికీ . ప్రజలు విలయినంతవరకు తగిన శాంతులు జరిపించుకొనుట శుభము.
శాంతులు అవసరము అయినవారు తప్పక సంప్రదించండి:-  9866193557
             గ్రహణ సమయములో ఆచరించు విషయములు 

1. గ్రహణ సమయంలో చేసే స్నానాలలో మంత్రాలు జపించకూడదు.
2. ముత్తైదువులు పట్టుస్నానంలో శిరస్సు తడవకుండా స్నానం చేయాలి.
3. వైధవ్య స్త్రీలు పట్టుస్నానంలో శిరస్సు తడిపి స్నానం చేయాలి.
4. గ్రహణం ముగిసిన తదుపరి సర్వులు శిరస్సు తడిపి స్నానం చేయాలి.
5 .గ్రహణ సమయంలో ఆహారపదార్ధాలపై నువ్వులుగానీ, దర్భగానీ ఉంచాలి.
6. గ్రహణం ముగిసిన తదుపరి యజ్ఞోపవీతమును మార్చాలి.


ఇంటిలో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు కొత్త ఇంటిని కట్టొచ్చా?
ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, ఆ గృహస్తులు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్స్ వంటి వాటివి కొనుగోలు చేయడం, కట్టడం వంటివి కూడదు. 

గృహ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ వాతావరణము దుమ్ము, ధూళి వంటి వాటివలన కాలుష్యమౌతుంది కనుక కచ్చితముగా గర్భిణీ స్త్రీలను, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శిశువు పుట్టిన తర్వాతే కట్టడాల నిర్మాణాలు,అలాగే నిద్రలేచిన వెంటనే గర్భిణీ స్త్రీలు పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ప్రొద్దునే నిద్రలేస్తూనే చూడటం మంచిది. నిద్రలేచిన వెంటనే దేవుడు పటాల్ని చూడటం ద్వారా రోజంతా శుభదాయకంగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు ఉండే ఇళ్లలో గృహస్థలం యొక్క దక్షిణము వైపున ఖాళీస్థలాన్ని వదిలిపెట్టి ఉత్తరము వైపున ఇల్లు ఉండకుండా చూడాలి. ఇటువంటి స్థలం గర్భిణీ స్త్రీలనే మాత్రమే గాకుండా స్త్రీలకు బాధలను కలిగిస్తాయి. 

మరోవైపు గర్భవతికి ఆరు మాసములు నిండిన తర్వాత గృహారంభం, గృహప్రవేశం తో పాటు సముద్ర ప్రయాణము, భర్త క్షవరము చేయించుకొనుట, శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదు. 

ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవమును మోయుట, శవము వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే.. నదీ స్నానము, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడటం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు. 

అలాగే గర్భిణీ స్త్రీలుండే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదు.

                                                                                              
                                                                                                        .---------చింతా గోపి శర్మ


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.