A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
కొన్ని కొత్త విషయములే అయినప్పటికి వాటియందు మనస్సును లగ్నము చేస్తారు, కార్య అనుకూలత వుంటుంది, కొన్ని వ్యాపారాలు లాభాన్ని ఎక్కువగా ఇస్తాయి, సమస్యలు సమసిపోతాయి, పెద్దల ఆరోగ్యము మందగిస్తుంది.
|
బ్యాంకు వ్యవహారాలను చక్కబెట్టు విషయములో తగు జాగ్రత్త అవసరము,ముఖ్య వ్యవహారాలలో తగిన నిర్ణయాలు తీసుకొంటారు, సోమవారము మీ పనులకు ఆటంకము కలిగే అవకాశమున్నది, ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.
|
డబ్బు వ్యవహారాలు అనుకూలించవు, నూతన స్త్రీల పరిచయాలలో కొంత జాగ్రత్త అవసరము, పూర్వపు మిత్రులను కలుసుకొను అవకాశమున్నది, ఉద్యోగస్తులు నూతన గృహ విషయముగా తలిచిన పని సాను కూలమగును.
|
శుక్రవారము వ్యాపార వ్యవహారాలలో తగినజాగ్రత్త వహించండి, కోపాన్ని అదుపులో పెట్టుకొనుట మేలు, మీ శ్రీమతి మాట వినుట వల్ల మీకు మంచే జరుగుతుంది, కర్చులు ఉన్నప్పటికీ ఆదాయము సమకూరటముతో ఇబ్బంది వుండదు.
|
కొన్ని అవకాశాలు మిమ్మలిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి, మీకు అప్పగించిన పనులను సమర్దవంతముగా పూర్తి చేస్తారు, గురు శిష్యుల సంబందాలు బలపడతాయి, అనుకోని బందువుల రాక ఆనందానికి గురి చెస్తుంది,వ్యాపారము అభివ్రుద్దిగానే వుంటుంది.
|
మీ సమర్ధతను పై వారు గుర్తించడం తో వారి అభినందనలను అందు కొంటారు, విరోధుల బాద కొంత వుంటుంది, మికళ్ళ ఎదుట జరిగిన కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలుగ చేయ వచ్చు, సోమవారము ప్రయాణపు జాగ్రత్త అవసరము.
|
మీరు రచించిన కొత్త ప్రణాలికలు లాబించుతాయి, ధన సమస్య తొలగుతుంది, అవసరానికి ధనము చేతికి వస్తుంది, బుధవారము కొన్ని అనుకోని పనులను పూర్తి చేయ వలసి రావచ్చు, మంగళ వారము ఇంట ఒక శుభ కార్యక్రవిషయము ఉండే అవకాశమున్నది.
|
ఈవారము అంత గా బాగుండలేదు, మద్య వర్తిత్వము విషయాలకు దూరముగా వుండుట మంచిది, ధన విషయపు ఒప్పందాలకు దూరముగా వుండుట మేలు, కొన్ని విషయాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యాపారము బాగానే వుంటుంది.
|
పై అధికారుల నిర్ణయాలు కొంత ఇబ్బందికి గురిచేసినప్పటికీ వారు చెప్పిన విధముగానే పనులను పూర్తి చేస్తారు, ఇంటిలో ప్రశాంతత నెలకొంటుంది, మిత్రుల రాక సంతోషాన్ని ఇచ్చి నప్పటికీ కర్చు ఇబ్బదికి గురిచేస్తుంది. |
ఖర్చులు అదిక మగుతాయి, కొన్ని పనులను అత్యవసరముగా అపవలసి వస్తుంది, కష్టబడి కుటుంబ అవసరాలని తిర్చ వలసి వస్తుంది, వ్యాపారము కొంత ఇబ్బాడికి గురి అవుతుంది, ధన సమస్యలో ఇబ్బంది తప్పదు.
|
శని వారము తలపెట్టిన పనులు పూర్తి చేయడములో ఇబ్బందులు వుంటాయి వ్యాపార ము కొంత మదగోడి గా సాగుతుంది, ఉద్యోగపు విషయములో పైఅదికారుల మన్ననలు పొందుతారు, మిత్రులే శత్రువులుగా శత్రువులుగా ప్రవర్తించే అవకాశమున్నది.
|
వ్యాపారము బాగుంటుంది వ్యాపారములో కొత్త మార్పులు మీ అభివృద్ధిని సాటుతాయి , ఇంటిలో ఆరోగ్య లోపాలు తొలగి ప్రసాంతత నెలకొంటుంది, ఒప్పందాలు కలసి వస్తాయి, మీ పేరు ప్రతిష్టలు విస్తరించు అవకాశమున్నది. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|