Nandananaama Samvaschara Nava Naayaka Phalamulu & 12 Rasulavaariki Adaaya Vyayamulu mariyu Raajyapoojya Avamaanamulu
నందన నామ సంవత్సర నవ నాయక ఫలము & 12 రాశుల వారికి ఆదాయ వ్యయములు మరియు రాజ్యపూజ్యఆవమానములు
రాజు :- శుక్రుడు
ఫలములు స్త్రీ పురుషుల కామప్రకోపములు అదికమగుట, బాలికలపై అత్యాచారములు పెరుగుట, వెండి,బంగారము,రత్నములు,లగ్జరీ సామాగ్రి ధరలు అధికమగును,మత్తు మందుల విక్రయము పెరుగును మరియు పాలకులకు ఇబ్బందికర వాతావరణము, రక్షణ శాఖకు పని పెరుగును. ఆయుర్వేద సుగంధ ద్రవ్యములు మరియు వులవలయొక్క ధరలు పెరుగును.
మంత్రి :- శుక్రుడు
అగ్ని ప్రమాదములు, ఆర్ధిక మాన్యం, పశువృద్ధి, విరోధములుతో పాటు పాలధార పెరుగుట గోధుమ, ధాన్యం, బొబ్బర్లు, కొబ్బరి బాగుగా పండును, వర్ష భావము పెరుగును.
సైన్యాధిపతి :- శుక్రుడు
రక్షణ వ్యవస్థ కు మంచికాలము, దొంగల ముఠాల యొక్క సంచార గుట్టును రట్టుచేసి వారి పనిని పట్టుదురు, ఉగ్రవాదుల గుట్టును రట్టు చేయుదురు, దేశములో సమ్మెలు అధికము, రవాణా వ్యవస్థ అభివృద్ధి కరముగా ఉండును.
సస్యాధిపతి :- చంద్రుడు
తొలకరి దాళవా పంటలు బాగుంటాయి,ఈ సారి పర్తి, నూలు,ధరలు పెరుగుతాయి,పండ్లు దిగుబడి బావుంటుంది,తెలుపు ఎరుపు నేలల పంటలు బాగుంటాయి,గాలి దుమారములు కూడా ఉండుటవల్ల కొంత పంట నష్టము.
ధాన్యాధిపతి :- రవి
ఎరుపు పంటలు బాగుండును, ప్రజలలో సఖ్యత తక్కువగా ఉండును,కోప తాపములతో వుందురు, పెట్రోలు వంటగ్యాసు ధరలు పెరుగును, భూకంప ఇత్యాది ఇబ్బందులు జన నష్టము యుద్ధ వాతావరణము కలదు.
అర్ఘాదిపతి :- శుక్రుడు
పర్వత ప్రాంతపు జనులు సుఖ శాంతులతోను మధ్యప్రాంతపు వారు కలహములుతోను వుందురు, తెలుపు పంటలుకూడా బాగుండును,నువ్వులు,చెక్కెర,వెం డి,యాలకులు,తగరము,నెయ్యి,గోధుమ ధరలు పెరుగును, నీటి ఎద్దడి తగ్గును.
మేఘాదిపతి :- శుక్రుడు
వర్షము చక్కగా ఉండును, సముద్ర తీర ప్రాంతముల వారికి అరిస్టములు విద్యా రంగములో కొత్త పందాలు, అత్యధిక ఉస్ట్నోగ్రత వల్ల జననష్టము,కొన్ని చోట్ల కరవు, తూర్పు ప్రాంతములలో వర్ష భావము అధికము.
రసాధిపతి :- భుదుడు
పెసల ధర తగ్గును, విభేదాల వల్ల మంత్రులు రాజీనామాలు చేయుదురు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలమద్య విభేదాలు, పిప్పళ్ళు,సొంటి,మిరియాలవంటివి మంచి ధరలు పొందును.
నీరసాధిపథి :- చంద్రుడు
సముద్ర మార్గ సమస్యలు, వెండి ముత్యముల ధరలు పెరుగుట, సముద్రపు ప్రమాదాలు, ప్రత్యేకించి మధుమేహ వ్యాది ప్రజలలో అధికమగును,సముద్రము ఉప్పొంగి అరిస్తము కలుగును.
12 రాశుల వారికి ఆదాయ వ్యయములు మరియు రాజ్యపూజ్యములు
ఆదాయము - వ్యయం ------- రాజ్య పూజ్యము - అవమానము