రత్నాలకు గ్రహాలకు అవినాభావ సంబంధం ఉంది. దీంతో మానవ జీవితాలకు కూడా దగ్గర సంబంధం ఉంది. జీవితంలో కలిగే కష్టసుఖాలు, వ్యాధి బాధలు, దుఃఖ సంతోషాలకు.. గ్రహాల ప్రభావమేనని శాస్త్రం చెబుతోంది. ఈ మానవ జీవితంలో కలిగే వ్యతిరేక ఫలితాల నుంచి తప్పుకొని పూర్తి శుభ ఫలితాలు పొందడానికి గ్రహ శాంతులతో పాటుగా రత్నములను ధరించే విధానాలు కుడా జ్యోతిశాస్త్ర పరమైనవే.
దోష రహితమైన ఉత్తమజాతికి చెందిన ప్రకాశవంతమైన వైడూర్యం, బంగారం లేదా వెండితో లేదా పంచలోహాలతో తయారు చేసిన ఉంగరంలో ఇమిడ్చి ధరించాలి. ఉంగరం అడుగు భాగం రంధ్రంను కలిగి ఉండే విధంగా పై భాగం ధ్వజాకారం లేదా వర్తుల, చతురస్రాకారము కలిగిన పీఠాన్ని ఏర్పరచి దాని మధ్యభాగంలో సూత్రం పైకి కనిపించే విధంగా వైడూర్యమును బిగించి, శుద్ది గావించిన తర్వాత శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వర్తించి శుభ ముహూర్తమున ధరించాలి.
కేతుగ్రహస్తమైన సూర్య చంద్రగ్రహాలు సంభవించిన సమయంలో వైడూర్య రత్నాన్ని ఉంగరంలో బిగించడం మంచిది. మూలా, ఉత్తరాషాడ, ధనిష్ఠ అనే నక్షత్రములతో కూడివచ్చిన అమావాస్య ఆదివారం రోజున గానీ మృగశిర 1-2 పాదముల యందు కానీ, ఉత్తర నక్షత్రములు గల సోమవారం కానీ శ్రావణ మాసంలో శుక్లపంచమి, పూర్ణిమా తిథుల యందు గానీ వర్జ్య దుర్ముహుర్తములు లేకుండా చూసి, రవి లేదా చంద్ర హోరాలు జరిగే సమయంలో వైడూర్య ఉంగరాన్ని బిగించాలి. ఆ తర్వాత దానిని ఒక రోజంతా ఉలవ నీటిలో ఉంచి, మరుసటి రోజు పంచ గవ్యములందు, మూడవ దినము తేనెను కలిపిన నీటియందు నిద్ర గావింపజేసి శుద్ధోదకము చేత పంచామృతము చేత స్నానము గావింపజేసి ఆ ఉంగరాన్ని శాస్త్రోక్త విధిగా ధూపదీప నైవేద్యములచే షోడశోపచార పూజలు గావింపజేసిన తర్వాత అనుకూలమైన శుభముహుర్తాన చేతికి ధరించవలెను.
ధరించెడివాడు తమకు తారాబలం, చంద్రబలం కలిగిన శుభ తిథులయందు, కృత్తిక, రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, శ్రవనం, ధనిష్ఠ, ఉత్తరాషాఢ నక్షత్రములు గల ఆదివారం, సోమవారం, మంగళవారం లయందు ధనుర్మీన కుంభరాసులు గల సమయంలో ఉంగరంను ధరించుట ప్రశస్తము.
ధరించుటకు ముందుగా ఉంగరంను తన కుడిచేతి హస్తం నందుంచుకొని తూర్పు లేక ఉత్తర ముఖంగా నిలబడి గురువును, గణపతిని ధ్యానించి "ఓం హ్రీం క్రీం ఐం హ్రీం శ్రీం కేతవే ఖండ శిరసే స్వాహా " అను మంత్రమునుగానీ, "సోమోధేనుగం"అను వేద మంత్రమునుగానీ 108 పర్యాయాలు జపించి ఉంగరమును ముమ్మారు కళ్లకద్దుకొని కుడిచేతి ఉంగరపు(అనామిక)వేలికి ధరించాలి. స్త్రీలు ఎడమ చేతికి ధరించినను దోషంలేదు. ఈ వైడూర్యమును బొటనవ్రేలికి ధరించినను దోషంలేదు. బొటన వ్రేలికి ధరించిన మంత్రసిద్ధులు చేకూరగలవు.
చూపుడు వేలికి ధరించిన ఆధ్యాత్మికాభివృద్ది, వైరాగ్యం, మోక్షం.. ప్రాప్తించగలవు. నడిమి వ్రేలికి ధరించకూడదు. చిటికెన వ్రేలికి ధరించిన వ్యాపారాభివృద్ది, ఉద్యోగప్రాప్తి, విద్యాజయం.. కార్యసిద్ధి కలుగును. హస్తకంకణము నందిమిడ్చి మణికట్టునకు (గాజువలే)ధరించిన సర్వార్థ సాధనము కలుగును.
ఇవి అన్ని కూడా వారి జాతక భాగాన్ని అనుసరించి చేయవలసినవి కావున మీరు ముందుగా సిద్దాంతులను సంప్రదించి రత్నములను ధరించవలయును లేని ఎదల దుష్ప్రభావములు ఉండగలవు. సంప్రదించు నెంబర్లు :-9866193557, 9989088557