ప్రదక్షిణం - పరమార్థం - ఫలితం



ప్రదక్షిణం అంటే తిరగడం అని అర్థం. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ప్ర - ప్రదక్షిణం చేయడానికి మీ కాళ్ళు కదులుతూంటే మీ పాపములు తొలిగిపోతాయి. 
ద - మీరు ఏ కోరికలతో అలమటిస్తున్నారో అవి ఇవ్వబడతాయి. 
క్షి - మీరు  ఏ కోరికలు లేకుండా ప్రదక్షిణం చేస్తే, జన్మ జన్మాంతరములందు చేసిన పాపములు పోతాయి.
ణం - ఆఖరి ఉపిరి దగ్గర పాపము లేనటువంటి మోక్ష స్థితిని ఇవ్వబడుతుంది. 

పరమార్థం
సకల చరాచర విశ్వంలో చైతన్యశక్తి అంతా ప్రతి క్షణం పరిభ్రమిస్తూనే ఉంటుంది. సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు నిత్యం ప్రదక్షిణం చేస్తూ అనంత శక్తిని గ్రహిస్తున్నాయి. విశ్వాంతరాళంలో వివిధ నక్షత్ర మండలాలు నిత్యం ప్రకాశించేవి.. పరిభ్రమ శక్తివల్లనే. గ్రహాలతో గ్రహించబడిన శక్తితోనే గ్రహచర జీవులు చైతన్యవంతమవుతున్నాయి. సూర్యుని చుట్టూ చేసే ఒక ప్రదక్షిణ ఓ విధంగా శక్తిని పరిగ్రహించే ‘ప్రదక్షిణ’ అని చెప్పవచ్చు. 

అనంతవిశ్వంలోని అణువణువూ ప్రకృతి అనే పరమాత్మను కేంద్రీకరించుకొని అది అందించే శక్తితోనే పరిభ్రమిస్తుంది. ప్రదక్షిణం వలన మాత్రమే గ్రహాలు సుస్థిరమైన స్థానం కల్పించుకోగలుతున్నాయని చెప్పవచ్చు. జననం నుంచి మరణం వరకు ఒక ప్రదక్షిణ ఎన్నో ఆవృతాలతో జన్మలలో సంపాదించుకున్న కర్మల ఫలితాలను అనుభవించడమే.. వాని దుష్ఫలితాలను తొలగించుకోవాలని తాపత్రయపడటమే.. ప్రదక్షిణ పరమార్థం.

ఆలయంలోని దైవశక్తి విశ్వశక్తి కేంద్ర బిందువుకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం విశ్వానికి సంకేతం. విశ్వంలో ప్రదక్షిణ చేయడం కుదరదు కనుక.. విశేశ్వరుని చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వానికి చేసే ప్రదక్షిణంగా భావించవచ్చు.

ఎలా చేయాలి?

అలసట లేకుండా, ఏకాగ్రతతో, స్థిరచిత్తంతో, అడుగులో అడుగు వేసుకుంటూ.. నిదానంగా నడవాలని స్మృతి చెబుతుంది. 9 నెలలు నిండిన నిండు గర్భిణీ, జలంతో నిండిన నిండుకుండను తలపై ధరించిన ఓ సతీమణి అలసట లేకుండా ఎలా నడుస్తుందో అలా నడవాలని ‘ప్రదక్షిణా’ సూత్రం విశదీకరిస్తుంది. 

అడుగులో అడుగు వేసుకుంటూ.. అడుగు వెంబడి అడుగును అనుసరిస్తూ.. చేతులను కదిలించకుండా.. నిశ్చలంగా జోడించి.. హృదయంలో భగవంతుని ధ్యానిస్తూ వాక్కుతో స్తోత్రం చేస్తూ ప్రదక్షిణం చేయారు. దీనినే ‘చతురంగ ప్రదక్షిణం’ అంటారు. సృష్టి, స్థితి, లయకారకులైన ముగ్గురు మూర్తులైన త్రిమూర్తులను స్మరిస్తూనే చేసే ప్రదక్షిణలు మూడు! పంచభూతాలలోనే పరమాత్మను అన్వేషిస్తూ.. పరంధాముని ఉనికి విశ్వసిస్తూ చేసే ప్రదక్షిణలు 5. 

నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదర్శనలకు ఒక విశిష్టత ఉంది. శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అనుమతి కోరుతూ, తన వివరాలు తెలుపుతూ... ఫలానా వాడిని ప్రదక్షిణకు వచ్చానని చెబుతూ చేసే ప్రదక్షిణం మొదటిది. నవగ్రహ అధిపతి అయిన సూర్యునికి చేసేది రెండవ ప్రదక్షిణం. ప్రదక్షిణలు చేయాలనే బుద్ధిని ప్రసాదించినందులకు చేసే ప్రదక్షిణం మూడవది. ఇలా మూడు ప్రదక్షిణాలకు అంతరార్థం ఉందని పెద్దలు అంటారు.

ప్రదక్షిణం చేసేటపుడు.. మనస్సు, తనువు అన్నీ భగవంతునిపై దృష్టి పెట్టడం వలన ప్రదక్షిణం శరీరంలోని, మనస్సులోని బాధలను హరించివేస్తుంది.. అందువలన కేవలం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా.. వ్యక్తిగతంగా ఉఛ్ఛస్థితికి చేరుకోవచ్చు.


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.