అశ్లేష నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు


     ఆశ్లేష నక్షత్రం గణము రాక్షస గణము. అధిదేవత పాము. రాశ్యాధిపతి చంద్రుడు. నక్షత్రాధిపతి బుధుడు.  
ఆశ్లేష నక్షత్ర మొదటి పాదము 

ఆశ్లేష నక్షత్ర మొదటి పాదం అధిపతి బుధుడు.అంసాదిపతి గురుడు  కనుక వీరి మీద  గురు, బుధగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకు విద్యా సంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలోనూ వీరు బాగా రాణించగలరు. విద్యాసంస్థలు స్థాపన, నిర్వహణలో వీరు సమర్థులు. వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే ప్రతిభను ప్రదర్శిస్తారు. 15 సంవత్సరాల సమయంలో హైస్కూల్ చదువు పూర్తి చేసే సమయంలో ఏడు సంవత్సరాల కేతుదశ కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయినప్పటికీ ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమిస్తే తప్పక విజయం సాధిస్తారు.

కేతువు అనుకూలంగా ఉన్న వారు సొంత ఊరికి దూరంగా (బయట ఊర్లలో లేక విదేశాలలో) విద్యాభ్యాసం చేయగలుగుతారు. తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య పూర్తి  కాగానే జీవితంలో స్థిరపడతారు.  వీరు చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడతారు. భూ, విద్యా, ఆభరణ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. తరువాత వీరికి జీవితం సాఫీగా జరిగిపోతుంది. 

ఆశ్లేష నక్షత్ర రెండవ పాదము

ఆశ్లేష నక్షత్ర రెండవ పాదము అధిపతి బుధుడు. అంసాదిపతి శని కనుక వీరి మీద బుధ,శని  గ్రహ ప్రభావం ఉంటుంది. వీరువ్యాపారం అంటే ఇష్టపడతారు. బుధ గ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. 11 సంవత్సరాల వయసులో హైస్కులు విద్య ముందే  వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. ప్రయత్నా పూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు.  

18 సంవత్సరాల వయసులో శుక్ర దశ మొదలవుతుంది. ఉన్నత విద్యాభ్యాస కాలంలో మనసు విలాసాల వైపు మళ్లే అవకాశం.. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. విద్య పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. మిగిలిన జీవితం 51 సంవత్సరం వరకు వీరికి సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల కలం సాగే రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురౌతాయి. రాహువు అనుకూలంగా ఉంటే  విదేశీవాసం, విదేశీయాత్ర చేయడానికి అవకాశం కూడా ఉంది. వృద్ధాప్యం ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుంది.

ఆశ్లేష నక్షత్ర మూడవ పాదము
ఆశ్లేష నక్షత్ర మూడవ పాదము అధిపతి బుధుడు. అంసాదిపతి శని కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. బుధగ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. శ్రమించి పనిచేసే గుణం కలిగి ఉంటారు. వీరికి వ్రుత్తి, వ్యాపారం, ఉద్యోగాల మీద సమానంగా ఆసక్తి ఉంటుంది. మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి. విద్యా ఆరంభంలోనే ఆటంకాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. 

ఏడు సంవత్సరాల వయసులో వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కారణంగా విద్య లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలకే శుక్రదశ వస్తుంది కనుక కళాశాల చదువుల కాలంలో విద్య కంటే అలకరణ అంటేనే ఇష్టముంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేయాలి. విద్యాభ్యాసం పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి. 34 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగిపోతుంది. 

ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదము

ఆశ్లేష నక్షత్ర నాలుగవ పాదం అధిపతి బుధుడుఅంసాదిపతి గురువు. ఆశ్లేష నక్షత్ర బుధుడు. వీరి మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. విద్యాసంబంధిత ఉద్యోగాలలో వీరికి ఆసక్తి ఉంటుంది. మేధా సంబంధిత ఉద్యోగాలలో రాణించగలరు. విద్యా సంస్థలు స్థాపన, నిర్వహణ వీరు సమర్ధవంతంగా చేస్తారు. వీరికి నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వీరు విద్యారంభంలోనే మూడు సంవత్సరాల నుండి వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగవలసిన అవసరం ఉంది. తరువాత 10 సంవత్సరాలకు వచ్చే శుక్రదశ కారణంగా విద్య కంటే అలకరణ అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కనుక ప్రయత్నా పూర్వకంగా మనసును విద్య వైపు మనసును మళ్ళించి విద్యాభ్యాసం పూర్తి చేసి విజయం సాధించవలసిన అవసరం ఉంది. 

నాలుగవ పాదములో జన్మించిన వారు కూడా విద్యాభ్యాసం పూర్తికాగానే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో తరువాత కొంత సౌఖ్యం తగ్గినా జీవితం సాఫీగా జరిగి పోతుంది. 53 సంవత్సరాల అనంతరం వచ్చే రాహు దశ కాలమో కొన్ని సమస్యలను ఎదుర్కోనవలసిన అవసరం ఉంది. రాహు దశ అనుకూలిస్తే విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగిపోతుంది. 

ఆశ్లేష నక్షత్ర జాతకుల గుణగణాలు


ఆశ్లేష నక్షత్ర జాతకులు ఏ విషయంలోనైననూ పట్టుదల కలిగి ఉంటారు. వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొని పోతుంది. శతృవుల విషయంలో పగతో ఉంటారు. వీరికి రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. వర్గ రాజకీయాలను సమర్ధతతో నడపగలరు. ప్రజా జీవితములో మంచి పేరు తెచ్చుకుంటారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను పూర్తి చేస్తారు.  న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్టపడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరపాటుగా ఉండే ఊహాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బందులకు గురవుతారు.

నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు. లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గడిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువవుతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడం దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. వీరికి ఆయుర్వేద మందులు, బియ్యం, పాల వ్యాపారం, పెట్రోలు బంకులు, బట్టల వ్యాపారము లాభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. 


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.