శ్రావణమాసం
పౌర్ణమి శ్రవణా నక్షత్రముతో కూడుకొని వున్న మాసమే శ్రావణ మాసము. ఈ మాసము లక్ష్మి దేవికి అత్యంత ప్రీతి పాత్రము గా పూర్వ శాస్త్రముల నిర్వచనము. దేవదానవులు సముద్రాన్ని చిలికినపుడు ఉద్భవించిన గరళాన్ని మహా శివుడు తన ఖంఠం లో బందించిన సమయము గా తెలుస్తోంది.
శ్రావణమాసం లో శ్రావణ మంగళ వారములు , శ్రవణ శుక్రవారములు, అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ అమ్మ వారి పూజకు ముఖ్యమైన దినములుగా ఈ మాసం లో లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు మరియు శ్రావణ సోమవారములు శివునికి జరుపు అభిషేకముల వల్ల అనేక శుభములు చేకూరుతాయి అని జ్యోతిష్య శాస్త్రరీత్యా తెలుస్తోంది.
ఈ శ్రావణ మాసమును పునస్కరించుకొని శ్రీ భువనేశ్వరి పీఠం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనగా అమ్మవారికి అభిషేకము, లలితసహస్ర, లక్ష్మి సహస్ర నామ పూజలు హోమములు నిర్వహించుట జరుగుచున్నది కావున భక్తులు ఎల్లరూ పాల్గొన వలసిందిగా కోరుచున్నాము .
ఇట్లు
శ్రీ భువనేశ్వరి పీఠం
పెద్దాపురం -533437
9866193557,9989088557