కుజదోషం - పరిహారములు-2


  
 ఏయే గ్రహాలతో ఉంటే ఫలితాలు కూడా ఎలా ఉంటాయో చెప్పబడింది. వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. కాబ‌ట్టి భయ పడాల్సిన ప‌ని లేదు.ఈ పరిహారక క్రియలు సమస్యల స్వరూపం బట్టి, జాతక పరిశీలనా చేసిన తరువాత చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది. వ్యక్తి చేయలేని పరిస్థితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం, నమ్మకం,విశ్వాస‌ము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి. భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నాడ‌నే భావన రావాలి. 

ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడ్డాయి.

·  సుబ్ర‌హ్మన్య స్వామి కుజుని అధిపతి. కాబ‌ట్టి అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం 7 సార్లు పారాయణ చేయాలి.
·   7 మంగళవారాలు ఉపవాసం ఉండి.. కుజ గాయత్రి  70 సార్లు పారాయణం, చేసి ఆఖరివారము కందులు దానం ఇవ్వాలి.
·  కుజ శ్లోకం ప్రతి రోజు 70 సార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రంలో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దానమివ్వాలి.
·  మ‌హిళ‌లు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.
·   ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం.. అదికూడా.. సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచిది.
·   ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి. సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.
·  ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
·  పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
·  షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగళ‌వారాలు ఆవు పాలతో అభిషేకం చేయాలి.
·   కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు)
·  కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.

కుజదోషము నివారించుటకు రామాయణంలో సూచించిన‌ పారాయణ క్రమంలు
·   కుజ దశలో కుజుని  అంతర్దశకు.. ఉత్తరకాండ 26 సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యం.
·   కుజ దశలో రాహు అంతర్దశకు.. యుధకాండ 58 సర్గ, తేనే ఎండుద్రాక్ష నైవేద్యం.
·  కుజదశలో కేతు అంతర్దశకు.. యుధకాండ 116 సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యం
·  కుజ దశలో శని అంతర్దశకు --  అరణ్యకాండ   70 వ సర్గ --    నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
·  కుజుదశలో బుధ అంతర్దశ ---        బాలకాండ 16వసర్గ --      ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
·   కుజు దశలో గురు అంతర్దశ --    సుందర కాండ 51  సర్గ--    అరటిపండ్లు నైవేద్యము.
·   కుజ దశలో శుక్ర అంతర్దశకు ---   సుందరాకాండ 53 సర్గ --   పాతిక బెల్లం, కారెట్ నైవేద్యం
·   కుజ దశలో రవి అంతర్దశకు ---    బాలకాండ ఇరై మూడు సర్గ --     చామ కారెట్ దుంప నైవేద్యం.
·  కుజదశలో రవి అంతర్దశకు ---     బాలకాండ పదిహేడవ సర్గ--   పాలు, పాయేసం నైవేద్యం

కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు

·   సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి 7మంగళవారములు ప్రదక్షిణాలు చేయాలి
·  ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
·   బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
·   మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
·   స్త్రీలు 7మంగళ‌వారాలు..7గురు ముతైదువులకు ఎర్రని పూలు, ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
·   ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్ర వస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
·   కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
·  రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
·  పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
·  రక్తదానము చేయుట చాల మంచిది.
·  అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
·  కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
·   రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
·   కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
·  కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
·   7, 8 స్థానాలలో కుజుడు ఉంటే డబ్బు ఉన్న సుఖం ఉండదు, అందుకని 7 మంగళవారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో 3 వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
·   కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ‌స్తే మంగళవారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.