ఉష్ణ ప్రకృతి గల గ్రహము కుజుడు. నిజానికి ఈ గ్రహాన్ని శాస్త్రం పాప గ్రహముగా చెప్పబడుతుంది. వివాహము, వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును. కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. ఈ గ్రహ దోషము కారణముగా అనేక మంది మహిళలు, పురుషులు జీవితాంతం అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుకోవాలంటే ఈ గ్రహ దోషము గురించి తెలుసుకొవాలి.
ఇనుము, తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని శాస్త్రవెత్తలు అంటారు. ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి కుజుడు.. గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిష్యంలో శాస్త్రవెత్తలు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు.
మంగళవారం కుజునకు చెందినది
ఎరుపు వర్ణం కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖం లాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ వద్దు. కొన్ని అంశాలు, వాటి స్థితిగతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహం అయినా శుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా.
స్త్రీల జాతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు కాబట్టే.. ముఖ్యంగా పెళ్లి విషయంలో కుజగ్రహ దోషం గురించి ప్రత్యేకంగా చెబుతారు. మాంగల్యం అనే సౌభాగ్యం.. స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం జరుగుతోంది. మరి ఈ దోషం పురుషులకు కూడా అప్పగించి.. కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకుండా చేసిన సరి కాదు. ఇక్కడ వివాహ కారకుడు శుక్రుడు.. కుజునికి శత్రువు. శాస్త్రరీత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్థానాలలో ఉండుట మంచిది.
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు
2వ ఇంట, 4వ ఇంట, 7ఇంట, 8వ ఇంట, 12వ ఇంట కుజుడు ఉండకూడదని. కాని కుజ నక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అలాగే.. బుధ, రవి, గురు దృష్టులు ఉంటే దోషం ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహం చేయాలి. అలా చేయకుంటే భార్యభర్తల మధ్య తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధం ఉండుట, దాంపత్య సుఖం లోపించుట, భర్త నిర్వహించాల్సిన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వం కలిగి ఉండుట, సంతాన హీనత, దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతోంది.