అపార్ట్‌మెంట్స్‌కు వాస్తు వర్తిస్తుందా..?

 



      పట్టణాల్లో, నగరాల్లో అధిక మొత్తములో కనిపించేవి అపార్టుమెంట్సే. ఇటీవల అపార్టుమెంట్స్ నిర్మాణం మరింతా పెరిగింది. భూమి మీద ప్రతి నిర్మాణానికి వాస్తు పనిచేస్తూ వుంటుంది. కాబట్టి అపార్టుమెంట్స్ కు కూడా వాస్తు పని చేస్తుందని చెప్పవచ్చు. మొదట అపార్టుమెంటు కాంప్లెక్సు వాస్తుకు సరిపెట్టాలి. అపార్టుమెంట్స్ - కాంప్లెక్సు వాస్తుకు సరిపెట్టడంలో విడిగృహలకు ఏ విధమైన వాస్తు విషయాలు వర్తిస్తామో అవే విషయాలు వర్తిస్తాయి. తరువాత కాంప్లెక్సులోని ప్రతి అపార్టుమెంట్ ను వాస్తుకు సరిపెట్టాలి. 

అపార్టుమెంట్ వాస్తు అంటుమిద్దెల వాస్తులో వలె ఎత్తు-పల్లాలు, ద్వారాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. సింహద్వారపు నడక ఖచ్చితంగా ఉచ్చములో వుండలేగాని.. నీచములో వుండకూడదు. అపార్టుమెంట్ ప్లాన్సును అనుసరించి కొన్నిటిని సింహద్వారాము ఉచ్చములో వుంటే వాటిపక్క వాటికో, ఎదుటి వాటికో, నీచములో సింహద్వారము ఉంటూ వుంటుంది. ఈ విధంగా కాకుండా అన్ని అపార్టుమెంట్స్ కు ఉచ్చములో సింహద్వారము వుండునట్లు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఏర్పాటు చేయడానికి స్థలాభావం, సాంకేతిక కారణాలు అడ్డురావచ్చు. అయితే ఇంజనీరు, వాస్తుశాస్ర్తవేత్త కలిసి ప్లాను తయారుచేస్తే పై సమస్యలు సులభంగా సరిచేయవచ్చు.

ఒక్కో అపార్టుమెంట్ కాంప్లక్సు ఒక్కో విధంగా వుంటుంది. కాబట్టి అన్నింటిని గురించి వివరించి చెప్పడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అయినా కొన్ని ముఖ్యవిషయాలు సూచిస్తున్నాను. అపార్టుమెంట్ ఎన్నో అంతస్తులో వున్నా ప్రతి గదికి ఉచ్చములో ద్వారాలు వుండాలి. కాంప్లెక్సుకు దక్షిణ, పశ్చిమాలలో తిరగడానికి వీలైనంత క్యాబిన్ వదలటం జరుగుతూ వుంది. ఈ స్థలం దక్షణం, పశ్చిమం ఖాళీ స్థలంగా పనిచేస్తూ వుంటుంది. అంతే కాకుండా ఈ క్యాబిన్ అపార్టుమెంట్ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా పల్లంగా వుండునట్లు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ, పశ్చిమాల క్యాబిన్ లు పల్లంగా కాకుండా ఇంటిఫ్లోరింగ్ తో సమానంగా గాని, అంతకన్నా ఎత్తుగా గాని వుండాలి. 

కాంప్లెక్సులోని ఉత్తర, తూర్పు భాగాల అంపార్టుమెంట్స్ తూర్పు ఉత్తరాలలో క్యాబిన్ వసతి వుండటం లాభదాయకం. ఈ క్యాబిన్ అపార్టుమెంట్ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా పల్లంగా వుండాలే గాని ఎత్తుగా వుండకూడదు. ఈ క్యాబిన్ ఈశాన్యం తగ్గటంకాని, తెగిపోవటంకాని జరుగకూడదు. 

ప్రతి అపార్టుమెంట్ కాంప్లెక్సులోని గ్రౌండ్ ఫ్లోర్ ను పార్కింగ్ స్థలంగా ఉపయోగించడం ఉత్తమమైనదే. అపార్టుమెంటు కాంప్లెక్సు గ్రౌండ్ ఫ్లోర్ లో దక్షిణ భాగంలో గాని, పశ్చిమ భాగంలోగాని ఏవైనా నిర్మాణాలుచేసి ఉత్తర, తూర్పు భాగాలను పార్కింగ్ స్ధలంగా వాగుకోవటం సర్వోత్తమమైనది. వాస్తు శాస్ర్తరీత్య అపార్టుమెంట్స్ నిర్మించుకొంటే.. విడిగృహములలో ఏ విధమైన వాస్తు ఫలితాలు అనుభవిస్తారో.. వాటికి తీసిపోకుండా ఫలితాలు పొందగలరని మరువకండి.

గోడలు అడ్డు పెడితే దోషం ఉండదా..?


      కొన్ని వాస్తు దోషాలు సవరించడానికి గోడలు అడ్డుగా నిర్మించడం, వాస్తు దోషం గల భాగాన్ని వదలివేయడం అనేది చాలాకాలంగా వాడుకలో ఉంది.  ఈ పద్ధతి కొన్ని పరిస్థితులలో తప్పని సరి అయితే కొన్ని సందర్భాలలో ఈ విధానం పూర్తి స్థాయిలో పని చేయదు. ఈ విషయం గురించి గృహస్థులు అవగాహన కలిగి వుండటం చాలా మంచిది.

సాధారణంగా దోషపూరితమైన మూలలు, దిక్కులు పెరిగినప్పుడు పెరిగిన స్థలాన్ని వదిలేస్తూ అడ్డుగా గోడ నిర్మించడం జరుగుతుంది. తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలానికి ఆగ్నేయం పెంపును వేరు చేస్తూ గోడ నిర్మించాలి. అయితే తూర్పు వైపు రోడ్డు వుండి, తూర్పు ఆగ్నేయం పెంపు కలిసి వుంటూ ఆగ్నేయం పెంపును వేరు చేస్తూ గోడను నిర్మించినా కొంత ఆగ్నేయ దోషం పని చేయక మానదు. ఎందుకంటే తూర్పు ఆగ్నేయం పెంపును సరి చేయగలంగాని, తూర్పు ఆగ్నేయం పెంచుతూ కొనసాగిన రోడ్డు నడకను మార్చలేముకదా.

ఇదే పద్ధతిలో రోడ్డు వైపు ఏ దిక్కులో పోరిగిన మూలలను సరి చేసినా, కొంత దోషం తప్పదని గుర్తుంచుకోండి. పెరిగిన మూలవైపు ఎటువంటి రోడ్డు లేకుండా ఇంటి లోపలి స్థలంలో పెరిగిన మూలలు సరి చేయడం వలన ఎటువంటి దోషం లేదు.

ఉదాహరణకు ఉత్తరంవైపు రోడ్డు ఉండి, దక్షిణ ఆగ్నేయం పెరిగిందనుకోండి.. ఇటువంటి సందర్భంలలో దక్షిణ ఆగ్నేయం పెంపును వేరు చేస్తూ ప్రహరీ నిర్మించడం వలన ఎటువంటి దోషం ఉండదు. కాని వదిలి వేసిన స్థలాన్ని కొందరు ప్రహరీ దాటి వాడటం జరుగుతూ వుంది. దాని వలన ఉపయోగం లేదు. వదలి వేసిన దోషయుక్తమైన స్థలాన్ని వాడటం వలన ప్రయోజనం వుండదు.

ఇంటి ప్రహరీ లోపల తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యం పెంపును సరిచేయడానికి తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్య స్థాలాలను వదిలివేసి ప్రహరీ నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా చేసేటప్పుడు గాని, లేదా చేసిన తరువాత కొంత కాలానికి గాని ఆర్థిక, ఆరోగ్య విషయాలలో నష్టపోవడం లేదా ఏదైనా ప్రతికూల సంఘటనలను ఎదుర్కొనడం జరుగుతుంది.

ఎందుకంటే, తూర్పు ఆగ్నేయం పెంపు సరి చేయునప్పుడు కొంత తూర్పు స్థలాన్ని, ఉత్తర వాయవ్యం సరి చేయునప్పుడు కొంత ఉత్తర స్థలాన్ని కోల్పోవడం జరుగుతుంది. దీని వలన తాత్కాలిక సంఘటనలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వుంటుంది. అటు తరువాత ఈ మార్పు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. 

రోడ్డువైపు పెరిగిన మూలలు సరి చేయునప్పుడు స్థలాన్ని సరి చేయగలమే గాని రోడ్డు నడకను మార్చలేం. కాబట్టి సరి చేసిన గోడను అనుసరించి చెట్లను పెంచడం వలన కొంత రోడ్డు నడక దోషం తగ్గుతుంది. ఇటువంటి సందర్భంలో గృహానికి దక్షిణ, పశ్చిమాల వైపు స్థలం ఎక్కువగా ఉంటే ఆ స్థలాన్ని వేరు చేస్తూ ప్రహారీ నిర్మించడం ఆచరణలో ఉంది. ఈ విధంగా వేరు చేసిన స్థలాన్ని పరాధీనం చేయడం మంచిది. అలా కాకుండా కేవలం ప్రహరీ నిర్మించి వేరు చేయడం వలన అనుకోని సంఘటనలతో తీరని నష్టాలు సంభవిస్తాయి. 

దక్షిణ, పశ్చిమాల వైపు ఎక్కువగా స్థలం ఉంటే నైరుతిలో బలమైన కట్టడాన్ని నిర్మించడం మంచిది. ప్రహారీ నిర్మించి ఎక్కువైన దక్షిణపు స్థలాన్ని వేరు చేయడం వలన ప్రవేశం లేని స్థలంగా మారతాయి. ప్రవేశం లేని స్థలం శాస్త్ర విరుద్ధం. అలాగని ప్రవేశం ఏర్పాటు చేస్తే స్థలం వేరు చేయనట్టే లెక్క.

అడ్డు గోడలు నిర్మించే విషయం పరిశీలిస్తే తూర్పు, ఉత్తరాల వైపు అడ్డుగోడలు నిర్మించడం వలన పరవలేదనిపించినా, దక్షిణ, పశ్చిమం అడ్డుగోడల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని గుర్తుంచుకోండి. అడ్డు గోడ నిర్మించి వేరు చేసిన స్థలాన్ని పరాధీనం చేయడం, పూర్తిగా వాడకుండా వుండటం వంటివి చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.