వాస్తు శాస్త్రంలో స్థలాల శుభాశుభములు కనుక్కోవడం చాలా అవసరం. కొత్త గృహాన్ని నిర్మించుకోవాలన్నా.. పాత గృహన్ని సరిదిద్దుకోవాలన్న ఈ అంశాన్ని పూర్తిగా చదివిన తరువాత ఏ విధంగా సరిదిద్దితే సరిపోతుంది అనే విషయం తెలుస్తుంది.
తూర్పు వీధి గల స్థలం
ఏ స్థలానికైతే తూర్పు వైపున వీధి ఉంటుందో దానిని తూర్పుభాగ ఫలాఫలాలు ఇంటి యాజమానిపైనా ఆ ఇంటగల మగసంతతి పైనా పని చేస్తాయి.
1. తూర్పు ఈశాన్యం పెంపుతో వీధి వుండి, తూర్పు ఉత్తరాలలో దక్షిణ, పశ్చిమాల కన్నా రెట్టింపు ఖాళీస్థలం ఉండి, గృహనికి, గృహావరణకు ఈశాన్యపు నడక వచ్చునట్లు ద్వారాలు వుండి, దక్షిణ, పశ్చిమ భాగాలు మిర్రుగాను, తూర్పు, ఉత్తరం భాగాలు పల్లంగా వుండి ఈశాన్యంలో నుయ్యి ఉన్న గృహంలో పుత్ర సంతతి ఎక్కువగా ఉండి, గొప్ప దశలో వుందురు. ఇటువంటి గృహములో నివసించువారు స్థిర, చరాస్తులు కల్గి, సంఘంలో గౌరవ, మర్యాదలు కల్గినవారై యుందురు.
2. తూర్పుభాగాము ఎత్తుగా వుండి, పశ్చిమం పల్లంగా వున్నచో యజమాని అనారోగ్యవంతుడవటయో, ఆడపెత్తనంగా వుండటమే జరుగును. ఇందు పురుష సంతతి లేకపోవటం గాని, వున్నా దరిద్రులుగానో, అమాయకులుగానో, దుర్వ్యసనపరులుగానో వుండి వృద్ధి లేనివారై యుందురు. అవమానాలు, అప్పుల బాధలు తప్పవు.
3. తూర్పు ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగియున్న అందు మగ సంతతి పుట్టరు. పుట్టినా ౨0 సంవత్సరాలలోపు మరణించడమో, యాక్సడెంట్ పాలై అంగవైకల్యము కలగటమో జరుగును. మతిలేనివారు, అమాయకులు ఇటువంటి గృహములో నుందురు. గృహయజమాని ప్రథమ కుమారుడి ఆరోగ్యం బాగా లేదనో, మరణించినాడనో, దుర్వాసనపరుడనో విచారించాల్సి వుండును.
4. ఈశాన్యంలో మేడ మెట్లు వుండి, ఈశాన్యం మూల మేడ వుండిన యజమాని అనారోగ్యం పాలై గాని, ప్రమాదవశాత్తు గాని మరణించును. యజమాని ప్రథమ కుమారుడు జీవించివున్నా ప్రయోజనం లేనివాడై ఉండును. దీనికి తోడు నైరుతిదోషాలు వుంటే ప్రథమ సంతతి దుర్మరణము పొందును.
5. ఈశాన్యంలో గొయ్యి, నుయ్యి, బోరింగ్, కుళాయి గుంటలు వున్న శుభఫలితాలు పొందుతారు.
6. ఈశాన్యంలో మరుగుదొడ్లుండిన అందు వంశము నశించడమో, వికారమైన, అమాయకపు పిల్లలు పుట్టడమో జరుగుతుంది. కుటుంబ కలహలు వస్తాయి. ఇందు గల సంతతి చెడు ప్రవర్తన కలిగి యుందురు. ఇటువంటి గృహలలో కులాంతర వివాహలు కూడా జరుగును. సాంప్రదాయలకు తిలోదకాలు ఇచ్చి నాస్తికజీవనం గడుపుదురు.
7. ఈశాన్యం ఎత్తుగా వుండటమో, ఈశాన్యం మూతపడటమో సంభవిస్తే ఆ ఇంటికి దత్తు రావటమో, ఇల్లరికపు అల్లుళ్ళను తెచ్చుకోవటమో జరుగుతుంది.
8. ఈశాన్యం వంటగది వలన ఖర్చు అధికమగును. ఈ గృహములో లక్షలు సంపాందించినా పది రూపాయలకు వెతకవలసి వుండును. ఈశాన్యపు వంటగది వలన ఐశ్వర్యవంతులు కూడా ఆర్థిక పతనము చెందుదురు. స్థిర చరాస్తులు అమ్ముకొందురు. భార్యభర్తలు పోట్లాడుకొంటూ అన్యోన్యత లేని జీవితము గడుపుదురు. ఈశాన్యం పొయ్యిగల గృహములో కొన్నింటిలో వంశము వుండదు.
9. ఈశాన్యం గది అన్ని గదులున్నా పల్లంగా వుండవలెను. ఈశాన్యపు గదికి ప్రవేశద్వారము, నిష్ర్కమణ ద్వారము అని రెండు ద్వారాలు వుండాలి. ఈశాన్యం గదిలో మూడు ద్వారాలు ఉండిన యజమానికి హృదయ సంబంధ రోగాలు వచ్చును.
10. ఇంటి ఆవరణకు, గృహనికి ఈశాన్యం తగ్గినచో సంతతి లేనివారగుటయో, యుక్తవయస్సు వచ్చిన సంతతి మరణించడమో సంభవించును.
11. గృహనికి తూర్పులు ఇంటి ప్లోరింగ్ లెవెల్ కన్నా ఎత్తుగా అరుగులున్నాచో అప్పుల బాధ ఎక్కువగా యుండును. ఆడ పెత్తనం జరగటం, అవమానాలు జరగటం సంభవిస్తుంది.
12. గృహనికి తూర్పు వైపులో గల ఖాళీ స్థలం తక్కువగా వుండి, పశ్చిమాన ఖాళీ స్థలం ఎక్కువగా వున్నాచో అందు మగ సంతతి లేకపోవటం లేదా ఆడ సంతతి ఎక్కువగా వుండటం జరుగుతుంది.
13. ఈశాన్యంలో ఇనుప సామాను, రాళ్ళకుప్పలు, పెంటపోగులు వేయకూడదు. యాక్సిడెంట్ జరుగుతుంది. అంతేకాకుండా బ్రతుకు భారమైపోతుంది.
14. తూర్పు గృహనికి ఉచ్చమైన ఈశాన్యభాగములోని ద్వారము సర్వశుభాలను చేకూరుస్తుంది.
15. తూర్పు ఆగ్నేయంలో ద్వారము వున్నా ఆ ఇంట రెండవ కుమారుడి గురించి విచారించాల్సి వస్తుంది. తూర్పు ఆగ్నేయపు నడక ఆ ఇంటి యజమానురాలి పైనా, రెండవ కుమారుడి పైనా దుష్ర్పభావనము చూపడమే కాకుండా, చోర భయము, అగ్నిభయం కల్గిస్తుంది. కోర్టు వ్యాజ్యాలు, జైలుశిక్షలు అనుభవించాల్సి వుంటుంది.
16. తూర్పు భాగం పల్లంగా వున్నచో వంశాభివృద్థి కలిగి, తరగని సిరులు గలవారై యుందురు.
17. తూర్పు ప్రహరీ గోడ పశ్చిమం ప్రహరీ గోడ కన్నా ఎత్తు తక్కువగా వుంటూ, రోడ్డుపై నడుచు వారికి వీధి గుమ్మము కనిపించినట్లు నిర్మించుకొనుట సర్వశ్రేష్ఠము. తూర్పు సింహద్వారము- దక్షిణం, పశ్చిమం వైపు సింహద్వారాల కన్నా ఎంతో కొంత చిన్నదిగా వుండవలెను.
18. తూర్పు భాగం పల్లంగా ఉండి, విశాలంగా వున్న కీర్తి , పేరు ప్రతిష్ఠలు, డబ్బు, ఉత్తమ సంతానం కలిగి యుందురు.
19. తూర్పు వాలువసారా (వరండా) వలన పురుష/లు సత్ఫలితాలను పొందుదురు. డబుల్ వసారా (వరండా) వలన పురుషులు మరింత ఉత్తమ ఫలితాలు పొందుదురు.
20. గృహము పశ్చిమ భాగం ఎత్తుగాను, తూర్పు భాగం పల్లంగాను వుండటము వలన పుత్రసంతతి వృద్ధి నొంది, ఐశ్వర్యవంతులై యుందురు.
21. తూర్పుకు హద్దుచేసి గృహములో వంశము లేకపోవటమో, నేత్రవ్యాధులు కలగటం, గుడ్డితనం కలగటం జరగడమో కాకుండా ఇంటి యందు స్ర్తీలే మగవారివలె పెత్తనం చెలాయించుదురు. ఆ ఇంట ఆడపిల్లలు వృద్ధి నొంది, మగపిల్లలు భ్రష్టులగుదురు. దానికి నైరుతి దోషాలు తోడైతే ఆడపిల్లలు ప్రవర్తనాదోషులై యుందురు.
22. తూర్పు ఆగ్నేయంలో గుంటలు, నుయ్యి వున్నచో సంతతి లేకపోవటము, ఇద్దరు భార్యలుండటము జరుగును. ఆ ఇంగ దొంగతనం, ఆగ్నిప్రమాదాలు జరుగును. కోర్టు వ్యవహరాలు, జైలుశిక్షలు అనుభవించడం జరుగును. భార్యభర్తలకు అన్యోన్యత లేకపోవటం, యజమానురాలు, ఆడసంతతి అనారోగ్యవంతులు అవటము జరుగును.
23. ఆగ్నేయము మూత పడినచో ఆ ఇంట ఆడసంతతి పెళ్లి అయిన తరువాత ఏదో ఒక కారణం వలన పుట్టింటికి చేరుకొందురు.
24. అరుగులు ఇంటి ప్లోరింగ్ లెవెల్ కన్నా తగ్గులో వున్న శుభఫలితాలను ఇచ్చును.
25. ఈశాన్యపు వీధిపోటు వున్నచో గొప్ప ఐశ్వర్యవంతులై, అధికారవంతులై ముందురు.
26. గృహములోని వాడుక నీరు ఈశాన్యం గుండా బయటకు వెళ్ళిన గొప్ప శుభఫలితాలను ఇచ్చును. ఆగ్నేయం గుండా బయటకు వెళ్ళిన ఆగ్నేయదోషాలు అనుభవించాల్సి వుండును.
27. స్థలం కన్నా రోడ్డు ఎత్తులో వుండకూడదు.