మత్స్య యంత్రము
మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి 'మత్స్యావతారము'. విష్ణు దశావతారములలో మొట్టమొదటి అవతారమే మత్స్యావతారము వేద సముద్ధరణకై అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపము. ఈ యంత్రము, ఇతర యంత్రముల కంటే చాలా విశిష్టమైనది. సమస్త వాస్తు దోష నివారణ యంత్ర రాజము ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థారము నందు గల సప్తావరణలలోను అతి ముఖ్యము శక్తివంతమైన బీజాక్షరములతో రూపొందించబడి, సర్వ సాంప్రదాయాను కూలముగా నిర్మించబడింది.
పూజా విధి ఈ మత్స్య యంత్రమును శాస్త్రానుసారముగా దైవజ్ఞులచే తయారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ కళాన్యాస, ప్రాణప్రతిష్టాదులను జరిపించి, శుభ సమయమున యంత్ర పూజ, జపాదులను ప్రారంభించవలెను. ఈ యంత్రమును శక్తివంతముగా చేయుటకై విధి విధానమును మిగిలిన యంత్రముల కన్న కొంచెం ఎక్కువగానే నిర్ధేశింపబడినది.
మత్స్య యంత్రమును
శ్లో || స్వర్ణేన రజతే నాపి పంచాంగుళ ప్రమాణకమ్ |
యంత్రపత్రం విరచ్యాధ సప్తకోణం లిఖేత్పురమ్ |
వాదిక్షాంతాని బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |
మధ్యేతు మత్స్య మాలిఖ్య గృహస్థాపన శోభనమ్ |
అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |
శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||
మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతములందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును మరియు యంత్ర మూలమంత్రమును చేసి శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈ యంత్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించినటువంటి గృహములు, శంఖు స్థాపన చేయక కట్టిన గృహములకు దోషమును పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.
పై యంత్రమునకు సంప్రదించు నెంబరు :- 9866193557