Telugu Astrology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Telugu Astrology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

హస్త నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు


నక్షత్రములలో ఇది 13వ నక్షత్రము. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం. రాశ్యాధిపతి - బుధుడు. అధిదేవత - సూర్యుడు. జంతువు - మహిషి(గేదె). హస్తనక్షత్రము నవాంశ విషయానికి వస్తే మొదటి పాదము - మేషరాశి, రెండవ పాదము - వృషభరాశి, మూడవ పాదము - మిధునరాశి, నాలుగవ పాదము - కర్కాటకరాశిలో ఉంటాయి.

హస్తా నక్షత్ర మొదటి పాదము
హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు. దేవగణ నక్షత్రం. కాబట్టి వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. అవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. ప్రేమ, ఆగ్రహం, అలక, అభిమానం వంటి భావాలు పరిస్థితులను బట్టి మార్చి ప్రదర్శిస్తారు. తరచూ అభిప్రాయాలూ కూడా మార్చుకుంటారు. 

15 ఏళ్ల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం జరుగుతుంది.

హస్త నక్షత్ర మొదటి పాదములోని జాతకులకు ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సైనిక పరమైన ఉద్యోగాలు కూడా అనుకూలం. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. భూ సంబంధిత, అగ్ని సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.    

33 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే ఇబ్బందులు ఎదురు కావు. 49 సంవత్సరాలకు మొదలయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 68 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా ఉంటుంది.

హస్తా నక్షత్ర రెండవ పాదము
ఆధ్యాత్మికం, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్రేకపూరిత స్వభావులైనా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. 

13 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహు దశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాల్సి ఉంటుంది. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది.

ఇక వీరు సౌందర్య పోషణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అలంకరణ వస్తువులను సేకరించడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కళారంగం వీరికి అనుకూలం. కళారంగం వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 

31 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించినది పదిల పరసుచుకుంటే  ఇబ్బందులు ఉండవు. 47 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి . 66 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది.

హస్తా నక్షత్ర మూడవ పాదము
11 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత  వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. 29 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభమవుతుంది. సంపాదించిన సొమ్ము పదిలపరచుకుంటే ఇబ్బందులు ఉండవు.  

ఇక బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఔషధ తయారీ, ఔషధ విక్రయశాల నిర్వహణ వంటి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మేధో సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి  అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు  వీరికి అనుకూలిస్తాయి.  

45 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిద శ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది. 

హస్తా నక్షత్ర నాలుగవ పాదము
వీరికి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. మాతృ వర్గంతో అనుబంధం అధికంగా ఉంటుంది. 9 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ  కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. 

జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగుతుంది. 27 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే  ఇబ్బందులు ఉండవు.  

వీరికి ఔషధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం.. వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం.
43 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 61 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.

హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు

ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. కోమలమైన శరీరం, పొడగైన ముఖ రూపం ఉంటుంది. అనుకున్న సముయములో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. చంచల స్వభావం కారణంగా తరచూ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధం చేసుకుని అడగగానే వారికి, సహాయము చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితములో ప్రధాన ప్రస్తావన అవుతుంది. వ్యుహాలు రహస్యం అయినా కొందరికి మాత్రమే చెబుతారు. 

దూరప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవితంలో మంచి మలుపులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింపుకు కొంత కాలం వేచి చూడాలి. న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది. సొంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గము పట్ల అభిమానము కలిగి ఉంటారు. సంతానం పేరు ప్రతిష్టలు తెస్తారు.

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం- గుణగణాలు, ఫలితాలు




    ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది 12వది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు. అధిదేవత ఆర్యముడు. గణము మనుష్య. రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు. జంతువు గోవు. ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో ధనసురాశి, రెండవ పాదములో మకరరాశి, మూడవ పాదములో కుంభరాశి, నాలుగవ పాదములో మీనరాశి.

ఉత్తర ఫల్గుణీ మొదటి పాదము
మొదటి పాదములో జన్మించిన వారైతే.. వెండితో పొదిగించిన కెంపును ధరించాలని రత్నాల శాస్త్రం చెబుతోంది. కెంపును ధరించడం ద్వారా ఉన్నత స్థానాలను అలంకరించడం, వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. ఉత్తర నక్షత్రంలో జన్మించిన జాతకులు 6 నుంచి 16 సంవత్సరాల వరకు వీరికి చంద్ర మహర్ధశ ఉంటుంది. కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.

16 నుంచి 23 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కలగటం వల్ల పగడమును బంగారంతో పొదిగించుకుని ధరించడం ద్వారా సుగుణవతి అయిన భార్య లభిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. పగడమును ధరించడం ద్వారా సుఖసంతోషములు చేకూరుతాయి. ఇక 41 నుంచి 57 సంవత్సరాల మధ్యలో గురు మహర్ధశ నడవటంతో ఈ జాతకులు పుష్యరాగంను బంగారముతో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించాలి. 
ఇక 57 నుంచి 76 సంవత్సరాల మధ్య శని మహర్ధశ. కాబట్టి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేష్టము. అలాగే 76 సంవత్సరాల తర్వాత ఉత్తర నక్షత్రం తొలి పాదంలో జన్మించిన జాతకులకు బుధ మహర్ధశ. కాబట్టి పచ్చను బంగారుతో పొదిగించి చిటికెన వేలుకు ధరించాలి. 

ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు ఈతి బాధలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం విష్ణుమూర్తికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం మంచిది. ఇలా 9వారాలు చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఉత్తర ఫల్గుణీ రెండవ పాదము

ఉత్తర నక్షత్రము రెండో పాదములో జన్మించిన జాతకులకు తొలి 4 సంవత్సరముల నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది. 4 సంవత్సరముల 6 నెలల వరకు, 14 సంవత్సరముల వయస్సు నుంచి 6 నెలల వరకు చంద్ర మహర్దశ.. వస్తుంది కావున ముత్యంను వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. 14 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 21 సంవత్సరముల 6 నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలి.

21 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 39 సంవత్సరముల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికంను వెండిలో మధ్య వేలుకు ధరించాలి. 39 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 55 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్దశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించడం మంచిది. ఇక 55 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 74 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్దశ. కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 74 సంవత్సరాల 6 నెలల వయస్సు నుంచి 91 సంవత్సరాల 6 నెలల వరకు బుధ మహర్దశ. కాబట్టి పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరం.

ఉత్తర ఫల్గుణీ మూడవ పాదము

వీరికి స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికంగా గుప్తంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని మార్గములో కూడా ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. తక్కువ ధరల్లో ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బంధుత్వానికి, పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు.

ఉత్తర ఫల్గుణీ నాలుగవ పాదము
ఉత్తర నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులు జన్మించిన ఒక సంవత్సరం నుంచి 6 నెలల వరకు రవి మహర్దశ. కాబట్టి కెంపును వెండిలో ఉంగరపు వేలును ధరించాలి. ఒక సంవత్సరము 6 నెలల వయస్సు నుంచి 11 సంవత్సరాల 6 నెలల వయస్సు వరకు చంద్ర మహర్దశ. కాబట్టి ముత్యంను వెండిలో ఉంగరము వేలుకు ధరించాలి. 11 సంవత్సరాలు 6 నెలల వయస్సు నుంచి 18 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహర్ధశ. కాబట్టి పగడంను బంగారములో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 18 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 36 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహర్దశ. కాబట్టి గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరం.

30 సంవత్సరముల 6 నెలల వయస్సు నుంచి 32 సంవత్సరముల 6 నెలల వరకు గురు మహర్ధశ. కాబట్టి కనక పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించాలి. 52 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 71 సంవత్సరముల 6 నెలల వరకు శని మహర్ధశ. కాబట్టి నీలంను వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది.

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు
ఈ నక్షత్ర జాతకులకు సకాలంలో వివాహమవుతుంది. భార్య ఆధిపత్యం అధికం. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. ఈ జాతకులు ముఖ్యంగా తండ్రి వలన ప్రయోజనము పొందుతారు. తేనెటీగ లాగా కూడబెడతారు. నైతిక బాధ్యతలు అధికం. ఇక వైవాహిక జీవితంలో సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి.

మఖ నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు


    మఖ నక్షత్ర అధిపతి కేతువు. మేషరాశి అధిపతి కుజుడు. ఇది రాక్షసగణ నక్షత్రం. నక్షత్రాధిపతి సూర్యుడు. మఖ నక్షత్రము నవాంశ విషయానికి వస్తే.. మొదటి పాదములో మేష రాశి ఉంటుంది. రెండవ పాదములో వృషభ రాశి, మూడవ పాదములో మిధున రాశి, నాలుగవ పాదములో కర్కాటక రాశి ఉంటుంది.

మఖ నక్షత్ర మొదటి పాదము
కుజుడి ప్రభావం వీరిని మరింత ప్రభావితం చేస్తుంది. అనుకున్న కార్యం వీరు అనుకున్నంత వేగంతోనే పూర్తిచే స్తారు. కేతు గ్రహ ప్రభావంతో వీరికి ఆద్యాత్మిక చింతన ఉంటుంది. ఏ కార్యమైనా  దైవ నమ్మకంతో పూర్తి చేస్తారు. రాజ్యాంగ సంబంధిత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 

బాల్యంలోనే శుక్ర దశ రావడంతో వీరికి విద్య మీద కంటే అలంకరణ సౌందర్య పోషణ మీద ఆసక్తి చూపిస్తారు. ఈ సమయంలో మనసును విద్య వైపు మళ్ళించి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తి చేయవలసిన ఉంటుంది. 26 సంవత్సరాల వరకు జీవితం సుఖ సౌఖ్యాలతో సాగుతుంది. తరువాత కొంత సుఖం తగ్గినా జీవితం సాఫీగా జరిగిపోతుంది. 49 సంవత్సరాల తరువాత వచ్చే రాహుదశ కొన్ని సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. 18 సంవత్సరాల రాహుదశ అనంతరం వచ్చే గురు దశ కారణంగా 67 సంవత్సరాల తరువాత జీవితం తిరిగి గాడిలోకి పడుతుంది. వృద్ధాప్యం ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతుంది.
    
మఖ నక్షత్ర రెండవ పాదము
 వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒక సారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. అలంకరణ వస్తువుల సేకరణ అంటే విపరీతమైన ఆసక్తి కనబరుస్తారు. బాల్యంలో వచ్చే శుక్రదశ కారణంగా కళారంగం అబ్బుతుంది. ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. కళా సంబంధిత వృత్తి,  ఉద్యోగాలు, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి.  

ఈ జన్మ నక్షత్రంలోని రెండవ పాదము వారికి 24  సంవత్సరాల వరకు సౌఖ్యవంతమైన జీవితం సాగుతుంది. ఆ తరువాత కొంత సుఖం కాస్త తగ్గినా 47 సంవత్సరాల వరకు సాఫీగా సాగిపోతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురైనా 65 సంవత్సరాల తరువాత జీవితంలో సౌఖ్యం తిరిగి మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యవంతంగా జరిగి పోతుంది.
  
మఖ నక్షత్ర మూడవ పాదము

  వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. కనుక వీరు ఒక్కసారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. మేధో సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  

కేతు గ్రహ ప్రభావం వలన వీరు అత్యంత ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వీరికి వ్యాపార, ఉద్యోగాల, వ్యవసాయం మీద సమానమైన ఆసక్తి ఉంటుంది. మూడవ పాదములో జన్మించిన వారికి కూడా చిన్న వయసులో శుక్రదశ కారణంగా విద్య కంటే సౌందర్య పోషణ, సౌఖ్యవంతమైన జీవితం మీద ఆసక్తి ఉంటుంది. ప్రయత్న పూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించవలసిన అవసరం ఉంది. 22 సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది కనుక జీవితం అప్పటి వరకు సౌఖ్యవంతంగా సాగుతుంది. తరువాత కాస్త సౌఖ్యం తగ్గినా 45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. 

తరువాత 18 ఏళ్ల రాహుదశ కారణం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ 63 ఏళ్ల కాలంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖసంతోషాలు మొదలవుతాయి. దీంతో వృద్ధాప్యం సాఫీగా సాగిపోతుంది.

మఖ నక్షత్ర నాలుగవ పాదము
వీరికి పట్టుదల అధికం. వీరికి తల్లి అంటే అభిమానం అధికంగా ఉంటుంది. కేతు గ్రహ ప్రభావం వల్ల వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వీరికి పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, ముత్యం, కాగితం, ఔషధ తయారీ విక్రయం వంటి వృత్తులు, ఉద్యోగాలు వ్యాపారాలు అనుకూలిస్తాయి.  

వీరికి 21 ఏళ్ల వరకు శుక్ర దశ ఉండటంతో జీవితం అప్పటి వరకు సాఫీగా సాగుతుంది. తరువాత కొంచెం సాఫీగా తగ్గినా 44 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత 18 సంవత్సరాల రాహుదశ కారణంగా  కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ, 62 సంవత్సరాల సమయంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. కనుక వృద్ధాప్యం సంతృప్తిగా జరిగిపోతుంది.

మఖ నక్షత్రము గుణగణాలు


ఈ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక భావం అధికంగా ఉంటుంది. కేతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. వీరికి పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అభద్రతా భావం ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము ఎక్కువే. మంచి మనుషులుగా పేరుతెచ్చుకునే ఈ నక్షత్ర జాతకులు సౌమ్యులుగా ఉంటారు. వీరికి గృహోపయోగం, విదేశీయాన యోగం మొదలైనవి కలిసి వస్తాయి. జీవితంలో ఎలాంటి లోటు వీరికుండదు. 

వీరు ఇతరుల సొమ్మును ఆశించే రకం కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు అనుక్షణం శ్రమించే నైజం ఉంటుంది. అయితే.. నిద్రలేమిని మాత్రం భరించలేరు. జరిగిన పోయిన సంఘటనలను అంత సులువుగా మరిచిపోరు. అప్పుడప్పుడు వాటిని తలచుకుని బాధపడతారు. ఇక ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి ముందు జాగ్రత్తలు చెబుతారు. కానీ ఆపద వస్తే మాత్రం ఆదుకునే స్థితిలో ఉండరు.

ఈ నక్షత్ర జాతకులకు ఆదివారం కలిసి వస్తుంది. బుధవారం, శనివారం సామాన్య ఫలితాలు కలుగుతాయి. మంగళవారం మాత్రం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించ వద్దు. వీరి అదృష్ణ సంఖ్యలు 1, 4. ఎరుపు రంగు ఈ జాతకులకు శుభ ఫలితాలను అందిస్తాయి. 

ఆరుద్ర నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు


ఆరుద్ర నక్షత్రాన్ని పరమేశ్వరుని జన్మ నక్షత్రంగా ప్రతీతి. ఆధిపత్య దేవుడు పరమేశ్వరుడు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. గోమేధికం రాయి పెట్టుకోదగినది. వీరు వస మొక్కలు పెంచుకోవాలి. దర్భ సమిధలతో హోమం చేస్తే మంచిది. 

ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మిథున రాశిలోనే ఉంటాయి. 

ఆరుద్ర మొదటి పాదము
ఆరుద్ర మొదటి పాదములో జన్మించిన వారు అదృష్టంపైనే నమ్మకం పెట్టుకుంటారు. అదృష్టంతోనే నెగ్గుకు రావాలనే మనస్తత్వం. వస్తు, విషయ జాగ్రత్తలు ఎక్కువ. ఈ విషయంలో ఒక్కోసారి శృతిమించుతుంటాయి కూడా. దీని వల్ల ఇబ్బందులు తప్పవు. పారదర్శక వైఖరితో కలుపుకునే స్వభావం ఉంటుంది. లోకాన్ని పరిశీలించే స్వభావం ఉండటంతో అవకాశాలపై పట్టు నిలుపుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయలపై, ఆచార వ్యవహారాలపై ఆసక్తి, శ్రద్ధ ఉంటుంది. 

ఆరుద్ర మొదటి పాదములో గ్రహ దశలు    
ఈ పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 18 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర రెండో పాదము
ఆరుద్ర రెండో పాదములో జన్మించిన వారిలో పట్టుదల, తీక్షణత ఎక్కువగా ఉంటాయి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఆలోచనల్లో భిన్నత్వాన్ని గుర్తించలేరు. దీంతో కోరి కష్టాలు తెచ్చుకుంటారు. పలు విషయాలందు ఆసక్తి ఎక్కువ. ఒక్కోసారి చేతులు కాల్చుకుంటారు. సమస్యలను గుర్తించటంలో ఇబ్బంది ఉంటుంది. మధ్యలో ఏర్పడే పరిణామాలతో కొంచెం గందరగోళానికి గురవుతారు.

ఆరుద్ర రెండో పాదములో గ్రహ దశలు    
రెండో పాదములో జన్మించినవారికి రాహు మహర్దశ 13 సంవత్సరాల ఆరు నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర మూడో పాదము
ఆరుద్ర మూడో పాదములో తరచూ సమస్యలు ఎదుర్కొంటారు. చురుకుదనం వల్ల ఒక్కోసారి హద్దు మీరుతుంది. దీంతో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వేగంతో ముందుకెళ్లబోయి తల బొప్పి కట్టించుకుంటారు. వాయుతత్వ స్వభావం ఉండటంతో నిర్ణయాల్లో నిలకడ లోపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. సర్దుకొనే స్వభావం ఉండటం కలిసి వచ్చే లక్షణం. కానీ సమస్యను నిజాయితీగా అర్థం చేసుకుంటేనే ఫలితముంటుంది.

ఆరుద్ర మూడో పాదములో గ్రహ దశలు    
మూడో పాదములో జన్మించినవారికి ముందుగా రాహు మహర్దశ 9సంవత్సరాలు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర  నాలుగో పాదము
ఆరుద్ర  నాలుగో పాదమున జన్మించిన వారు నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా లౌక్యం, చాకచక్యం మిగిలిన లక్షణాలను ప్రభావితం చేస్తాయి. దూరదృష్టితో వ్యవహరించాలి. నిలకడ సాధించడం కూడా ముఖ్యమే. నిదానమే ప్రధానం అన్న సూక్తి వర్తిస్తుంది. అందరిని కలుపుకుపోయే స్వభావం ఉంటుంది. దీంతోపాటు ఫలితాన్ని పంచుకొనే వైఖరికూడా అవసరం. అనవసరపు కోపానికి సంకెళ్లు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా గెలిచి రావాలన్న వ్యూహాన్ని సమర్థంగా అమల్లో పెట్టాల్సి ఉంటుంది.

ఆరుద్ర  నాలుగో పాదములో గ్రహ దశలు    
నాలుగో పాదములో జన్మించిన వారికి ముందుగా రాహు మహర్దశ 4 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు ఉంటాయి.

ఆరుద్ర నక్షత్రము - గుణగణాలు

ఈ నక్షత్రములో జన్మించిన వారిది అనుకొన్న దానిని సాధించేదాకా నిద్రపోని తత్వం. మాటల్లో నేర్పరితనమును, మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. పట్టుదల కూడా ఉంటుంది. కార్యసాధనలో ఎన్నిసార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బుల విషయంలో నిర్ణయాలు సరిగా ఉండవు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనే కోరిక, మొండి పట్టుదల జీవితంలో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందరపాటుతో ముందు వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొనలేరు. 

ఆయుస్సు కూడా ఎక్కువే. ఆడవారిపట్ల గౌరవ భావం కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుంచి 26 సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.

ఈ నక్షత్రము వారు ఆలోచనలు, నిర్ణయాలు చకచకా మార్చేసుకుంటారు. క్రయ విక్రయాలయందు ఆసక్తి ఉంటుంది. దీంతో వ్యాపారమందు దూసుకెళ్లే స్వభావం కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వీరితో పాటు వెంట ఉన్నవారికికూడా ఇబ్బంది తప్పదు. 

మత్స్య యంత్రము

మత్స్య యంత్రము




మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి 'మత్స్యావతారము'. విష్ణు ద‌శావ‌తార‌ముల‌లో మొట్టమొద‌టి అవ‌తార‌మే మ‌త్స్యావ‌తార‌ము వేద స‌ముద్ధర‌ణ‌కై అవ‌త‌రించిన శ్రీ మ‌హావిష్ణువు రూప‌ము. ఈ యంత్రము, ఇత‌ర యంత్రముల క‌ంటే చాలా విశిష్టమైన‌ది. స‌మ‌స్త వాస్తు దోష నివార‌ణ యంత్ర రాజ‌ము ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థార‌ము నందు గ‌ల స‌ప్తావ‌ర‌ణ‌ల‌లోను అతి ముఖ్యము శ‌క్తివంత‌మైన బీజాక్షర‌ముల‌తో రూపొందించ‌బ‌డి, స‌ర్వ సాంప్రదాయాను కూల‌ముగా నిర్మించ‌బ‌డింది.


పూజా విధి ఈ మ‌త్స్య యంత్రమును శాస్త్రానుసార‌ముగా దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ క‌ళాన్యాస‌, ప్రాణ‌ప్రతిష్టాదుల‌ను జ‌రిపించి, శుభ స‌మ‌య‌మున యంత్ర పూజ‌, జ‌పాదుల‌ను ప్రారంభించ‌వ‌లెను. ఈ యంత్రమును శ‌క్తివంత‌ముగా చేయుట‌కై విధి విధాన‌మును మిగిలిన యంత్రముల క‌న్న కొంచెం ఎక్కువ‌గానే నిర్ధేశింప‌బ‌డిన‌ది.


మత్స్య యంత్రమును
శ్లో || స్వర్ణేన రజతే నాపి పంచాంగుళ ప్రమాణకమ్ |
యంత్రపత్రం విరచ్యాధ సప్తకోణం లిఖేత్పురమ్ |
వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |
మధ్యేతు మత్స్య మాలిఖ్య గృహస్థాపన శోభనమ్ |
అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |
శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||

మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతములందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును మరియు యంత్ర మూలమంత్రమును చేసి శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈ యంత్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించినటువంటి గృహములు, శంఖు స్థాపన చేయక కట్టిన గృహములకు దోషమును పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.
పై యంత్రమునకు సంప్రదించు నెంబరు :- 9866193557

Features of Rasi, Lagnal, Jathakam - Chinta Gopi Sarma Siddanthi

Chinta Gopi Sarma Siddanthi provides you features of Rasi, Lagnal, Jathakam, Vasthu and etc. For more information visit http://www.jathakadarshini.com/



Dasara Navratri 2014 Special Celebration at Bhuvaneswari Devi Peetham

Most accurate & popular online telugu Astrology Predictions

Welcome to our Chinta Gopi Sarma Siddanthi online telugu Astrology predictions services in Andhra Pradesh, India. Chinta Gopi Sarma provides you Telugu Astrology, jyothisham in telugu, horoscope, vasthu, poojalu, astrology predictions, online telugu astrology, Telugu Jyothisham, daily horoscope, telugu poojalu, weekly horoscope, birth chart, marrage issues, online vasthu services, online telugu astrology predictions with affordable prices.


Chinta Gopi Sarma is one the great siddanthi in astrology, horoscope, jathakam and etc. He will provide you astrology services, you can get more information about telugu astrology at chinta gopi sarma. Chinta Gopi Sarma is happy to say that teluguastrology.net is the first astrology website which started Astrology in Telugu, telugu jyothisham services, vasthu services, telugu horoscope services and etc.


Recently we have developed Astrology in Telugu android application with features like Telugu Astrology, telugu jyothisham, marriage matching, telugu horoscope, vasthu, poojalu, telugu jathakam and you can check at www.teluguastrology.net. Bhuvaneswari Peetam provides you Dasara Navaratri 2014 special celebration at Sri Lakshmi Lalitha jyothishailam, for more updates about navarathri special celebrations you can get at www.teluguastrology.net

Astrology In Telugu

Astrology in Telugu | Online Astrology in Telugu | Astrology Telugu | Horoscope In Telugu | Stra Signs | Telugu Astrology | Telugu Panchangam | Zodiac Signs |


Telugu Astrology

http://www.teluguastrology.net/feeds/postsChinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Divagna.He is a great Siddanthi from Andhra Pradesh.


He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.




You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
chintagopisarma@yahoo.com(Yahoo)


Phone No: 9866193557 (or) 9989088557


Land Line: 08852- 243557




He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.