రుద్రాక్షలు



శివపురాణం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రకారణ్యమహాత్యం, దేవిభాగవతం, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగ పురాణం, స్కంద పురాణం, పద్మపురాణం లాంటి అనేక గ్రంథములలో రుద్రాక్షలవివరణ ఉన్నది.
రుద్రాకారణ్యమహాత్యం  
ఒకప్పుడు త్రిపురాసుర పదార్థమైన నేను నిమిలిత నేత్రకుడినై యుండగా నాకన్నుల నుండి జలబిందువులు భూమ్మీద పడినవి ఆ జలబిందువుల నుండి సర్వజనులక్షేమార్థము రుద్రాక్ష వృక్షములు జనించినవి అని పరమేశ్వరుడు స్వయముగా చెప్పాడు.  

''స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్
భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్
లక్షం తు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్"

అని రుద్రాక్షమాల గురించి "జాబాలోపనిషత్"లో పేర్కొనబడింది.

రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు.  శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు.

"ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే"
అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి. కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.
రుద్రాక్షలు 
ఏకముఖి. (ఒక ముఖము కలిగినది) అత్యంత శ్రేష్టమయినది.  
ద్విముఖి (రెండు ముఖములు కలిగినది) ఇది శివపార్వతుల స్వరూపం 
త్రిముఖి (మూడు ముఖములు కలిగినది) త్రిమూర్తి స్వరూపం 
చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది) నాలుగు వేదాల స్వరూపం
పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది) పంచభూత స్వరూపం
షట్ముఖి (ఆరు ముఖములు కలది) కార్తికేయ రూపం 
సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది) కామధేనువుగా పరిగరించుతారు 
అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)విఘ్నేశ్వరరూపం
నవముఖి (తొమ్మిది ముఖాలు కలది) నవగ్రహ స్వరూపం.
దశముఖి (పది ముఖాలు కలిగినది) దశావతార స్వరూపం.
 జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. ఇండస్ట్రియల్ స్కానింగ్ కానీ , డెంటల్ ఎక్స్ రే యంత్రంతో తీసిన ఎక్స్ రే ద్వారా నిజమైన రుద్రాక్షని గుర్తించవచ్చు

నక్షత్రము --- ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని --- నవముఖి
భరణి --- షణ్ముఖి
కృత్తిక --- ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి --- ద్విముఖి
మృగశిర --- త్రిముఖి
ఆరుద్ర --- అష్టముఖి
పునర్వసు --- పంచముఖి
పుష్యమి --- సప్తముఖి
ఆశ్లేష --- చతుర్ముఖి
మఖ -- నవముఖి
పుబ్బ --- షణ్ముఖి
ఉత్తర --- ఏకముఖి, ద్వాదశముఖి
హస్త --- ద్విముఖి
చిత్త --- త్రిముఖి
స్వాతి --- అష్టముఖి
విశాఖ --- పంచముఖి
అనురాధ --- సప్తముఖి
జ్యేష్ఠ --- చతుర్ముఖి
మూల --- నవముఖి
పూర్వాషాఢ --- షణ్ముఖి
ఉత్తరాషాఢ --- ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం --- ద్విముఖి
ధనిష్ట --- త్రిముఖి
శతభిషం --- అష్టముఖి
పూర్వాభాద్ర --- పంచముఖి
ఉత్తరాభాద్ర --- సప్తముఖి
రేవతి --- చతుర్ముఖి


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.