Astrology Online లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Astrology Online లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

రేవతి నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు



నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము. రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు.

రేవతి నక్షత్రము మొదటి పాదము 
 రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఈ నక్షత్రంలోని మొదటి పాదము జాతకుల మీద గురు బుధ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ  నక్షత్రం. వీరికి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరికి విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించ గలిగే నేర్పు ఉంటుంది. విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలం. 

ఈ జాతకులకు 16 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు  విద్యారంభం నుంచి ప్రతిభ చూపిస్తారు. 16 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ   కాలంలో విద్యసాధన విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. తరువాత 23  సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి  ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో విద్య  సాధనలో విజయం సాధించాల్సి ఉంటుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 66 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 

రేవతి నక్షత్ర రెండవ పాదము  
వీరు ఆధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూ సంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక విద్య అనుకులిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది.

ఈ జాతకులకు 12  సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. వీరు మొదటి నుంచి విద్యాలో ప్రతిభ చూపిస్తారు. 12 సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతు దశ   కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతు దశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 19 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్ర దశ కాలంలో విద్యకంటే విలాసాల మీద ఆసక్తి అధికం. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 62 సంవత్సరాల వరకు జీవితం  సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే  విదేశీఉద్యోగావకాశాలు, విదేశీపర్యటనలు కలిసి వస్తాయి. 80 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ  కారణంగా జీవితం మళ్లీ గాడిలో పడుతుంది. ఇక వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

రేవతి నక్షత్రము మూడవ పాదము 
వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. వీరికి భూసంబంధిత, వాయు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్య అనుకూలిస్తుంది. న్యాయ సంబంధిత విద్య కూడా వీరికి అనుకూలిస్తుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు.   

ఈ జాతకులకు ఐదు సంవత్సరాల వరకు మాత్రమే బుధదశ ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఐదు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలోవిద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  ప్రయత్నపూర్వకంగా అడ్డంకులను అధిగమించి విజయం సాధించాలి. కేతుదశ అనుకూలిస్తే సమస్యలు ఉండవు. 12  సంవత్సరాల తరువాత వచ్చే 20  సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి ఉంటుంది. శుక్రదశ కాలంలో విద్య కంటే విలాసాల మీదికే మనసు మళ్లుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య  వైపు మళ్ళించి సఫలం కావాలి. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వీరికి సకాలంలోనే వివాహం జరుగుతుంది. 55 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల   రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 73 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురు దశ  కారణంగా జీవితంలో తిరిగి సుఖం వస్తుంది. వృద్ధాప్య దశ కూడా సౌఖ్యంగా గడుస్తుంది.

రేవతి నక్షత్రము నాలుగవ పాదము   
వీరికి విద్య సంస్థలు స్థాపించి నిర్వహించ కలిగిన సామర్ధ్యం  ఉంది. వీరికి విద్యా సంబంధిత వృత్తులు, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వీరికి నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే బుధ దశ   ఉంటుంది. కనుక వీరికి విద్యారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. 

నాలుగు సంవత్సరాల తరువాత ఏడు సంవత్సరాల కేతుదశ కాలంలో విద్యలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  సమస్యలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో విద్యలో అభివృద్ధి  ఉంటుంది. శుక్రదశ   కాలంలో విద్య కంటే విలాసాల మీద ఆసక్తి ఉంటుంది కనుక మనసును పట్టుదలతో విద్య  వైపు మళ్ళించి విజయం సాధించాలి. ఇక వీరు సకాలంలో జీవితంలోనే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 54  సంవత్సరాల  వరకు జీవితం సాఫీగా   జరుగుతుంది. తరువాత వచ్చే 18  సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహు దశ అనుకూలిస్తే  విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 72 సంవత్సరాలకు వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా జీవితంలో తిరిగి సౌఖ్యం వస్తుంది. వృద్ధాప్యం సాఫీగా గడిచిపోతుంది.     

రేవతీ నక్షత్రము ఫలితాలు

ఈ నక్షత్రమున జన్మించిన వాడు రూపవంతుడు, ధనవంతుడు, భోగములను అనుభవించువాడు, పాండిత్యము కలవాడై ఉంటారని శాస్త్రం చెబుతోంది. చరరూప ధన సంపదలు కలవారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. 

ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. ఆర్ధిక ప్రగతిని తొందరగానే సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుంచి తప్పించుకుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండదండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉండదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. 

మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుంచే తెలివితేటలను ప్రదర్శిస్తారు.

విశాఖ నక్షత్రము -గుణగణాలు, ఫలితాలు



   నక్షత్రములలో ఇది 16వ నక్షత్రము. ఇది గురు గ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని. జంతువు పులి, రాజ్యాధిపతి కుజుడు. గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది.

విశాఖ నక్షత్ర మొదటి పాదము

విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరు ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. 

ఇక విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కళాశాల చదువులలో కాస్త మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.  తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా సుఖం కాస్త తగ్గవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కాస్త జాప్యం కలుగే అవకాశం ఉంది. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం జీవితకాలం సహకరిస్తుంది. 

ఉపాధ్యాయ వంటి వృత్తులు వీరికి అనుకూలం. అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత  ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. 

33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీ పర్యటన అనుకులిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.

విశాఖ నక్షత్ర రెండవ పాదము   
ఈ జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కల్గి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆపాధ్యాయులు రంగ వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది. పసుపు వర్ణ వస్తువులు, శ్వేత వర్ణ వస్తువులకు సంబంధించిన, జలసంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. 

విద్యా ఆరంభ దశలో బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో  విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది.  పదేళ్ల వయసు వరకు జీవితం సాఫీగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. 

ఇక సంపాదించిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం తరువాత వచ్చే జీవితకాలానికి సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 46 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  కేతుదశ అనుకూలిస్తే  విదేశీ పర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం.  53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది. 

విశాఖ నక్షత్ర మూడవ పాదము
 వీరికి పనుల యందు పట్టుదల ఉంటుంది. కార్య నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. వీరు  విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.  

ఈ నక్షత్ర జాతకులకు తొలి నుంచి విద్య మందకొడిగా ఆరంభమవుతుంది. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 6 సంవత్సరాల వయసు వరకు జీవితం సుఖంగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. 42 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం.  49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. ఇక మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది. 

విశాఖ నక్షత్ర నాలుగవ పాదము 
 వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి మెండు. కోపతాపాలు, ప్రేమాభిమానాలు మార్చిమార్చి ప్రదర్శిస్తారు.  ఉపాధ్యాయ రంగ వృత్తులు వీరికి అనుకూలం. ఔషధ సంబంధిత, శ్వేత వర్ణ సంబంధిత వస్తువుల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 

జన్మించిన తర్వాత కొంత కాలం మాత్రమే సౌఖ్యంగా ఉంటారు. తరువాత కొంత సుఖం తగ్గుతుంది.  ఆరు సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది.  2 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. విద్యాభ్యాసం మందకొడిగా సాగుతుంది. 21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. 38 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన ఉంటుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. 

విశాఖ నక్షత్రము గుణగణాలు
 - ఫలితాలు


ఈ నక్షత్ర జాతకులకు గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది. కాబట్టి బాల్యం సుఖంగానే ఆరంభమవుతుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలవుతుంది. గురు గ్రహ నక్షత్రమైన విశాఖలో జన్మించిన ఈ జాతకులకు పట్టుదల, మొండితనం ఉంటుంది. అనుకున్నది అమలు చేసే మనస్తత్వం.

భార్య లేక ఓ స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశము చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. సొంతంగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వల్ల ఖ్యాతి లభిస్తుంది. అన్యభాషలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో కూడా విజయం సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. 

ఇక ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారమూ లేకపోలేదు. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వలన నష్టము, లాభము సమానంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీ పౌరసత్వము లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు.  భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జివితములో సమపాళ్ళలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరము జీవితం సుఖవంతం. కనుక కనుక వృద్ధాప్యము సుఖవంతమే.

విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం రంగు అన్ని విధాలా అనుకూలం. కాబట్టి నీలపు రంగు చేతి రుమాలును అధికంగా వాడటం మంచిది. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు 6 సంఖ్య అన్ని విధాలా సహకరిస్తుంది. అలాగే 4, 5, 8 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అయితే 1, 2 అనే సంఖ్యలు ఏ మాత్రం కలిసి రావు. ఇక గురువారం తలపెట్టే కార్యాలు ఈ జాతకులకు దిగ్విజయంగా పూర్తవుతాయి.

విశాఖ నక్షత్రము నాలుగో పాదంలో పుట్టిన జాతకులకు మంగళవారం, సోమవారం, బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. అయితే చంద్రాస్టమందినాల్లో ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదదు. నాలుగో పాదంలో జన్మించిన జాతకులకు 9 అదృష్ట సంఖ్య. ఇంకా 9, 18, 36 అనే సంఖ్యలు శుభ ఫలితాలనిస్తాయి. అయితే 6, 8 సామాన్య ఫలితాలనివ్వగా, 4, 5, 6, అనే సంఖ్యలు వీరికి అశుభ ఫలితాలిస్తాయి. ఇక పసుపు, ముదురు పచ్చ రంగు వీరికి అదృష్టానిస్తాయి.

ఇక ఈ నక్షత్ర జాతకులు వ్యాపారాభివృద్ధి కోసం ప్రతి శుక్రవారం నేతితో సుబ్రహ్మణ్య స్వామికి దీపమెలిగించడం మంచిది. ఇలా 9 వారాలు ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు ఫలప్రదమవుతాయి.


Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.