Weekly Predictions లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Weekly Predictions లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఉత్తరాబాద్ర నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు



నక్షత్రములలో ఉత్తరాబాద్ర 26వ నక్షత్రము. ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యాధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు. 

ఉత్తరాబాద్ర నక్షత్రము మొదటి పాదము  
  వీరికి తండ్రితో వ్యతిరేకత ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. శ్రమించి పనిచేయగలరు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. పరిశ్రమలు,   కర్మాగారాలు ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు ఉంటుంది. ఇక ఈ జాతకులకు సాంకేతిక  విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. 

ఈ జాతకులకు 17 సంవత్సరాల పాటు శని దశ ఉంటుంది. శని దశ కాలంలోవిద్య కాస్త మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే 17  సంవత్సరాల బుధ దశ కాలంలో అనుకూలత ఏర్పడి ఉన్నత విద్యాభ్యాసం బాగాసాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. 34 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, విదేశీ ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 41 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ  కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత  జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగానే సాగుతుంది. 

ఉత్తరాబాద్ర నక్షత్రము రెండవ పాదము   
ఈ జాతకుల మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రము. ఈ జాతకులకు సమయానుకూలంగా వ్యవహరించే నేర్పు ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఆసక్తి. వ్యాపారం అనుకులిస్తుంది కూడా. వీరికి విద్యా సంబంధిత, పరిశ్రమల సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. వీరు బుద్ధి కుశలత కలిగి ఉంటారు.  

ఈ జాతకులకు 13 సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సక్రమంగా సాగుతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 30 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ ఉద్యోగావకాశాలు, విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. 37 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో మంచి ఫలితాలు కలుగుతాయి. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. వృద్ధాప్య దశ కూడా సాఫీగా గడిచిపోతుంది. 

ఉత్తరాబాద్ర నక్షత్రము మూడవ పాదము
వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం  ఉంటుంది. వీరు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటారు. వీరికి నౌకలలో ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి సాంకేతిక  విద్యలు, వృత్తి విద్యలు అనుకూలిస్తాయి. 

ఈ జాతకులకు తొమ్మిది సంవత్సరాలు శని దశ  ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17 సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. ఈ జాతకులు సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 26 సంవత్సరాల తరువాత వచ్చే 7  సంవత్సరాల కేతుదశ  కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడిఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 33 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది. 

ఉత్తరాబాద్ర నక్షత్రము నాలుగవ పాదము  
వీరికి సమయానుకూలంగా ప్రవర్తించే సామర్ధ్యం ఉంటుంది. వీరికి ధైర్యం, ఆవేశం ఉంటాయి. భావోధ్వేగాల విషయంలో తమ మీద తమకు నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి  విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయం వృత్తులు వ్యాపారం ఉద్యోగం అనుకూలిస్తాయి. సాంకేతిక విద్యలు, వృత్తి విద్యలు కూడా అనుకూలిస్తాయి.  

ఈ జాతకులకు ఐదు సంవత్సరాలు శని దశ ఉంటుంది. శని దశ కాలంలో విద్య మందకొడిగా సాగుతుంది. తరువాత వచ్చే  17  సంవత్సరాల బుధ దశ కాలంలో అభివృద్ధి కలిగి ఉన్నత విద్యాభ్యాసం సాఫీగా సాగుతుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలోనే జరుగుతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు, అక్కడి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. 29 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కాలంలో సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగుతుంది. 72 సంవత్సరాల  వచ్చే18 సంవత్సరాల రాహు దశ  కాలంలో కాస్త ఒడిదుడికులు ఎదుర్కొంటారు.  

ఉత్తరాబాద్ర నక్షత్రము ఫలితాలు

    ఈ నక్షత్ర జాతకులకు అన్ని విషయాల మీద కనీస అవగాహన ఉంటుంది. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. వీరు చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. 

కుటుంబ చరిత్ర, తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. వీరి జీవితం సాఫీగా జరిగి పోతుంది. 30 నుండి 40 సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు. 

శతభిష నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు




నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. శతభిషము రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని.

శతభిష నక్షత్రము మొదటి పాదము

శతభిషా నక్షత్ర మొదటి పాదము ధనసు రాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు, శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. ఈ నక్షత్ర జాతకుల మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. ఈ కారణం వల్ల వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఈ జాతకులకు ఆధ్యాత్మిక విశ్వాసం,  ధార్మిక గుణం ఉంటుంది. రచయితలుగా రాణించగలరు. ఉపాధ్యాయ వృత్తి  అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలం. 

ఈ జాతకులకు 16 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండా పోతాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో ఉన్నత చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది. వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 32 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. 

51 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా జీవితంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 68 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలిస్తేనే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది. 

శతభిష నక్షత్రము రెండవ పాదము
ఈ నక్షత్ర జాతకుల మీద రాహు శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం.. కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. శ్రమించి పట్టుదలతో కార్యాలను నెరవేర్చగలరు. ఈ జాతకులకు పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి.  

ఈ జాతకులకు 12 సంవత్సరాల కాలం రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. రాహు దశ అనుకూలిస్తే అడ్డంకులు తగ్గుతాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు కనిపించకుండానే ముగిసిపోతాయి. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో మాధ్యమిక చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. ఇక వీరు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే 28 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. దీంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. 

47 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 64 సంవత్సరాల కాలంలో వచ్చే ఏడు సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రలకు అవకాశం ఉంటుంది. 71 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము మూడవ పాదము
 వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. పట్టుదలతో, శ్రమించి కార్యాన్ని పూర్తి చేయగలరు. వీరికి  పరిశ్రమలు, కర్మగాలు సంబంధిత ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.  

ఈ జాతకులకు ఎనిమిది సంవత్సరాల కాలం రాహుదశ ఉంటుంది. కనుక ఆరంభ విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. రాహుదశ అనుకూలిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల పెంపక దశలో రాహు దశ సమస్యలు ప్రభావం చూపే అవకాశం లేదు. తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కాలంలో చదువులలో అభివృద్ధి కనిపిస్తుంది. జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగవచ్చు. 24 సంవత్సరాలలో వచ్చే 19 సంవత్సరాల శని దశ వస్తుంది. దీంతో సంపాదన కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. 43 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 

60 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతుదశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధ యాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం ఉంటుంది. 67 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత 20 సంవత్సరాల శుక్ర దశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగానే గడిచిపోతుంది. 

శతభిష నక్షత్రము నాలుగవ పాదము  
వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఇక వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం, ధార్మిక గుణం ఉంటుంది. వీరు రచయితలుగానూ రాణించే నేర్పు ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి  వీరికి అనుకులిస్తుంది. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగ, వృత్తి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  

ఈ జాతకులకు నాలుగు సంవత్సరాల కాలం మాత్రమే రాహు దశ ఉంటుంది. కనుక తొలి నుంచే విద్యభ్యాసం నిరాటంకంగా కొనసాగుతుంది. నాలుగు సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా చదువు ఆటంకాలు లేకుండా సాగుతుంది.  అయితే ఉన్నత విద్యాభ్యాసంలో అడ్డంకులు తప్పకపోవచ్చు. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 20 సంవత్సరాలలోవచ్చే 19 సంవత్సరాల శని దశలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగుతుంది. 

39 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. 56 సంవత్సరాల కాలంలో వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి. తీర్ధయాత్రకు, విదేశీ పర్యటనకు అవకాశం  ఉంటుంది. 63 సంవత్సరాల తరువాత సమస్యలు తగ్గుతాయి. తరువాత వచ్చే 20  సంవత్సరాల శుక్రదశ కాలంలో తిరిగి సుఖం మొదలవుతుంది. వృద్ధాప్య దశ సుఖంగా గడిచిపోతుంది.

శతభిష నక్షత్రము - ఫలితాలు

ఈ నక్షత్ర జాతకులకు విద్యభ్యాసం కొంతకాలం మందకొడిగా సాగినా.. క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. వీరికి సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపారవెత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలతో పాటు, చిక్కులు కూడా ఎదుర్కొంటారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. 

వివాహాది శుభకార్యాలు వాయిదా పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి. ఆత్మీయులతో అరమరికలు లేకుండా మెలగడం వల్ల మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం దశలో కొంత కాలం జరిగిన తరువాత సుఖం మొదలవుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వల్ల మార్పులు తప్పవు.  

విశాఖ నక్షత్రము -గుణగణాలు, ఫలితాలు



   నక్షత్రములలో ఇది 16వ నక్షత్రము. ఇది గురు గ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని. జంతువు పులి, రాజ్యాధిపతి కుజుడు. గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది.

విశాఖ నక్షత్ర మొదటి పాదము

విశాఖ నక్షత్ర అధిపతి గురువు. విశాఖ రాక్షసగణ నక్షత్రం కనుక వీరు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరు ఆవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. 

ఇక విద్యాభ్యాసం కొంత వరకు బాగానే సాగుతుంది. కళాశాల చదువులలో కాస్త మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్నపూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.  తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా సుఖం కాస్త తగ్గవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో కాస్త జాప్యం కలుగే అవకాశం ఉంది. సంపాదించినా దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తులు ఏర్పరచు కోవడం జీవితకాలం సహకరిస్తుంది. 

ఉపాధ్యాయ వంటి వృత్తులు వీరికి అనుకూలం. అలాగే విద్యుత్, అగ్ని భూ సంబంధిత  ఉద్యోగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. 

33 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 50 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీ పర్యటన అనుకులిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది.

విశాఖ నక్షత్ర రెండవ పాదము   
ఈ జాతకులు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. స్థిరమైన అభిప్రాయాలు కల్గి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆపాధ్యాయులు రంగ వృత్తులు వీరికి అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక గురువులుగా కూడా వీరు రాణించగలరు. ఆధ్యాత్మిక విశ్వాసం అధికంగా ఉంటుంది. పసుపు వర్ణ వస్తువులు, శ్వేత వర్ణ వస్తువులకు సంబంధించిన, జలసంబంధిత  వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. 

విద్యా ఆరంభ దశలో బాగానే ఉంటుంది. మాధ్యమిక విద్యాకాలంలో  విద్యలో మందకొడితనం నెలకొంటుంది. ప్రయత్న పూర్వకంగా విజయం సాధించవలసిన అవసరం ఉంది.  పదేళ్ల వయసు వరకు జీవితం సాఫీగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలుగవచ్చు. 

ఇక సంపాదించిన దానికంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు ఏర్పరచుకోవడం తరువాత వచ్చే జీవితకాలానికి సహకరిస్తుంది. 29 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధదశ  కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 46 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  కేతుదశ అనుకూలిస్తే  విదేశీ పర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం.  53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది. 

విశాఖ నక్షత్ర మూడవ పాదము
 వీరికి పనుల యందు పట్టుదల ఉంటుంది. కార్య నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది.  వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. విచక్షణా జ్ఞానం అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం అంటే ఇష్టం. వీరు  విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించాలన్న ఆసక్తి కలిగి ఉంటారు. మేధా సంబంధిత, విద్యా సంబంధిత, భూ సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలిస్తాయి.  

ఈ నక్షత్ర జాతకులకు తొలి నుంచి విద్య మందకొడిగా ఆరంభమవుతుంది. పట్టుదలతో విజయం సాధించాల్సి ఉంటుంది. 6 సంవత్సరాల వయసు వరకు జీవితం సుఖంగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 25 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కారణంగా జీవితం సాఫీగా సాగుతుంది. సకాలంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. 42 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే  విదేశీపర్యటన అనుకూలిస్తుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం.  49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. ఇక మిగిలిన జీవితం సౌఖ్యంగా కొనసాగుతుంది. 

విశాఖ నక్షత్ర నాలుగవ పాదము 
 వీరు ధర్మపక్షపాతం కలిగి ఉంటారు. నిర్వహణ సామర్ధ్యం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో కూడా వీరికి ఆసక్తి మెండు. కోపతాపాలు, ప్రేమాభిమానాలు మార్చిమార్చి ప్రదర్శిస్తారు.  ఉపాధ్యాయ రంగ వృత్తులు వీరికి అనుకూలం. ఔషధ సంబంధిత, శ్వేత వర్ణ సంబంధిత వస్తువుల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 

జన్మించిన తర్వాత కొంత కాలం మాత్రమే సౌఖ్యంగా ఉంటారు. తరువాత కొంత సుఖం తగ్గుతుంది.  ఆరు సంవత్సరాల వయసు వరకు సౌఖ్యంగా జీవితం గడుస్తుంది.  2 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా కాస్త సుఖం తగ్గుతుంది. విద్యాభ్యాసం మందకొడిగా సాగుతుంది. 21 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కారణంగా జీవితం ఉన్నత విద్యలో అభివృద్ధి ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. 38 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన ఉంటుంది. తీర్ధ యాత్రలకు ఇది అనుకూల సమయం. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో తిరిగి సుఖం నెలకొంటుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. 

విశాఖ నక్షత్రము గుణగణాలు
 - ఫలితాలు


ఈ నక్షత్ర జాతకులకు గురు దశతో జీవితం ఆరంభం అవుతుంది. కాబట్టి బాల్యం సుఖంగానే ఆరంభమవుతుంది. తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలవుతుంది. గురు గ్రహ నక్షత్రమైన విశాఖలో జన్మించిన ఈ జాతకులకు పట్టుదల, మొండితనం ఉంటుంది. అనుకున్నది అమలు చేసే మనస్తత్వం.

భార్య లేక ఓ స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశము చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. సొంతంగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వల్ల ఖ్యాతి లభిస్తుంది. అన్యభాషలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో కూడా విజయం సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. 

ఇక ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారమూ లేకపోలేదు. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వలన నష్టము, లాభము సమానంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీ పౌరసత్వము లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు.  భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జివితములో సమపాళ్ళలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరము జీవితం సుఖవంతం. కనుక కనుక వృద్ధాప్యము సుఖవంతమే.

విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం రంగు అన్ని విధాలా అనుకూలం. కాబట్టి నీలపు రంగు చేతి రుమాలును అధికంగా వాడటం మంచిది. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు 6 సంఖ్య అన్ని విధాలా సహకరిస్తుంది. అలాగే 4, 5, 8 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అయితే 1, 2 అనే సంఖ్యలు ఏ మాత్రం కలిసి రావు. ఇక గురువారం తలపెట్టే కార్యాలు ఈ జాతకులకు దిగ్విజయంగా పూర్తవుతాయి.

విశాఖ నక్షత్రము నాలుగో పాదంలో పుట్టిన జాతకులకు మంగళవారం, సోమవారం, బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. అయితే చంద్రాస్టమందినాల్లో ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదదు. నాలుగో పాదంలో జన్మించిన జాతకులకు 9 అదృష్ట సంఖ్య. ఇంకా 9, 18, 36 అనే సంఖ్యలు శుభ ఫలితాలనిస్తాయి. అయితే 6, 8 సామాన్య ఫలితాలనివ్వగా, 4, 5, 6, అనే సంఖ్యలు వీరికి అశుభ ఫలితాలిస్తాయి. ఇక పసుపు, ముదురు పచ్చ రంగు వీరికి అదృష్టానిస్తాయి.

ఇక ఈ నక్షత్ర జాతకులు వ్యాపారాభివృద్ధి కోసం ప్రతి శుక్రవారం నేతితో సుబ్రహ్మణ్య స్వామికి దీపమెలిగించడం మంచిది. ఇలా 9 వారాలు ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు ఫలప్రదమవుతాయి.

పుష్యమి నక్షత్రం - గుణగణాలు, ఫలితాలు



నక్షత్రములలో పుష్యమి 8వ నక్షత్రము. పుష్యమి నక్షత్రాధిపతి శని. గణము దేవగణము. అధిదేవత బృహస్పతి. 

పుష్యమి నక్షత్రము మొదటి పాదము
పుష్యమి నక్షత్రము మొదటి పాదములో జన్మించిన జాతకులు నవరత్నాల్లో నీల రత్నాన్ని ధరించాలి. పుష్యమి తొలి పాదములో జన్మించిన జాతకులకు 19 సంవత్సరాల కాలం పాటు శని మహర్దశ జరగడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైఢూర్యమును వెండితో చిటికెన వేలుకు ధరించడం మంచిది. అలాగే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ. వజ్రమును బంగారంతో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయి.

63 నుంచి 69 సంవత్సరాల వరకు ఈ జాతకులకు రవి మహర్దశ.. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. ఇదేవిధంగా 69 నుంచి 79 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ ఉంటుంది కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. అలాగే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. 

ఈ జాతకులు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి హైస్కులు వరకు చదువు మందకొడిగా సాగుతుంది. అయినా ప్రయత్నా పూర్వకంగా పైచదువులు కొనసాగిస్తే చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 35 ఏళ్ల అనంతరం వచ్చే కేతు దశలో  వీరికి సమస్యలు ఉన్నా కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇస్తుంది. కేతు దశ 7 సంవత్సరాల అనంతరం వచ్చే 42 సంవత్సరాలలో వచ్చే శుక్ర దశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఇనుము, అగ్ని సంబంధిత వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. అంతేకాదు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. శుక్ర దశ నుంచి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది.

పుష్యమి నక్షత్ర  రెండవ పాదము
పుష్యమి నక్షత్ర 2 వ పాదం లోని జాతకుల జీవితం సాఫీగా సాగిపోతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు. శుక్ర దశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. ఇంజనీరు, లాయరు వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ప్రతిభ సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు. మేధస్సును ఉపయోగించే ఉద్యోగావ్యాపారాలు చేస్తారు. ఉన్నత ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలం. ఇనుము, భూమి సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలం.

పుష్యమి నక్షత్ర మూడవ పాదము
పుష్యమి నక్షత్రము 3 వ పాదం నక్షత్ర అధిపతి శని. కనుక వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవ గుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. 6 సంవత్సరాల వరకు విద్యారంభం కొంచెం మందకొడిగా ఆరంభం అయినా తరువాత వచ్చే బుధ దశ 17 సంవత్సరాల కాలంలో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య  నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు. 23 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహానంతరం 30 సంవత్సరాలలో వచ్చే శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం ఆరంభం అవుతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే వీరికి విదేశాలలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన జీవితం వీరికి సాఫీగా సాగిపోతుంది. సముద్ర సంబంధిత, నుకా సంబంధిత, జల సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఇనుము, ముత్యం, తెల్లని వస్తువుల వ్యాపారం వీరికి అనుకూలం. న్యాయవాదులుగా వీరు రాణిస్తారు. నౌకా సంబంధిత ఉద్యోగాలు  కూడా వీరికి అనుకూలమే. 

పుష్యమి నక్షత్ర నాలుగవ పాదము
పుష్యమి నక్షత్ర 4 వ పాదం   నక్షత్ర అధిపతి శని. వీరి మీద  కుజ శనిగ్రహ ప్రభావం  ఉంటుంది. వీరు అనుకుది పట్టుదలతో సాధిస్తారు. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందుంటారు. రెండు సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల కాలం బుధదశ వస్తుంది కనుక వీరు ఉన్నత విద్యాభ్యాసం వరకు చదువులో రాణిస్తారు. తరువాత 7 సంవత్సరాల కేతదశ కారణంగా  ఉన్నత విద్యను   కొన్నిఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు. 

కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. విద్య పూర్తి చేయగానే జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో స్వల్పంగా జాప్యం ఉంటుంది. వైమానిక దళంలో ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం వంటి వృత్తులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. 28 సంవత్సరాలలో శుక్రదశ  వస్తుంది కనుక జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుంది. సైనిక, భూమి, ఇనుము సంబంధించిన ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలం.

పుష్యమి నక్షత్రము గుణగణాలు

శనిగ్రహ నక్షత్రమైన పుష్యమిలో జన్మించిన జాతకులు బాల్యం నుంచి యవ్వనం వరకు కష్టపడి జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ జాతకుల ప్రత్యేక లక్షణం. మంచి విషయాలకు ప్రాధాన్యమిచ్చి, ఇతరుల చెడు ప్రవర్తనను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం కలిగి ఉంటారు. వీరికి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. 

యవ్వనం నుంచి వీరి జాతకం అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. యవ్వనం వచ్చినప్పటి నుంచి వృత్తి ఉద్యోగాలకు ఎంపికకవుతారు. వీరి జీవితం వివాహ అనంతరం గాడిలో పడుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. స్వార్జితముగా వృద్ధిలోకి రాగలరు. కుటుంబ విషయములో ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహము తక్కువగా ఉంటుంది . స్నేహితులు మరియు సన్నిహితుల ప్రోత్సాహము , సహకారము వలన వీరు జీవితమున అత్యున్నత స్థాయికి చేరుకొంటారు .

వీరి వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే వ్యాపారంలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోవాలంటే, శనీశ్వరునికి నెలకోసారి తైలాభిషేకం చేయించాల్సి ఉంటుంది. ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. 

ఇక సోమవారం, బుధవారం, ఆదివారాల్లో ఈ జాతకులు చేపట్టే కార్యములన్ని విజయవంతమవుతాయి. అయితే గురువారంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. 

వీరి అదృష్ట సంఖ్యలు: 2, 7.

Astrology In Telugu

Astrology in Telugu | Online Astrology in Telugu | Astrology Telugu | Horoscope In Telugu | Stra Signs | Telugu Astrology | Telugu Panchangam | Zodiac Signs |



Chinta Gopi Sarma is one of the best Astrologer's of India.He often called as Daivagna. He is a great Siddanthi from Andhra Pradesh.
He will do Grahadosha Homas, Shanthi Yagas and Vasthu Planes for the people.
You Can cantact him at
chintagopisarma@gmail.com(Gmail)
Phone No: 9866193557 (or) 9989088557
Land Line: 08852- 243557
He is a very famous personality in doing BHUVANESWARI DEVI PUJAS.