A professional Astrologer
Gopi Sarma Siddhanthi
Weekly Predictions, Telugu Astrology, Vara Falalu, Rashi Predictions, Rashi, Rashi Falalu, Weekly Astrology Predictions, Accurate Rashi Predictions, Telugu Astrology Predictions
|
అనుకోని అవకాశాలు మీకు కలసివస్తాయి, ఇంటిలోని శుభ కార్యక్రమ విషయాలు చర్చిస్తారు, కొన్ని సమస్యలు మిమ్మలిని ఇబ్బంది పెట్ట వచ్చు, వ్యపార సమస్యలు తప్పవు.సంతకాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త అవసరము.
|
![]() |
వ్యాపార లాభాలు మరియు పనులలో విజయము పెద్దల అనుగ్రహము తో ఈవారము ఉండగలదు,శుక్రవారము కొన్నివిషయములలో జాగ్రత్తలు తీసుకొనుట మంచిది, మీ ఉద్యోగపు అవకాశములు మెరుగుపడతాయి.
|
![]() |
పట్టుదలతో ముందుకు సాగవలసిన సమయము ఇది, కొన్ని కొన్ని విషయాలు మీకు అనుకువగావుండక మనస్తాపము కలుగుతుంది, కొన్ని ఆలోచనలు కొన్ని విషయములు మిమ్మలిని ప్రలోభానికి గురిచేయవచ్చు జాగ్రత్త వహించుటమేలు.
|
![]() |
ఖర్చు పెరగడముతో రాబడి పెంచు ఆలోచనలు చేస్తారు, మగలవారము చెక్కుల విషయములో జాగ్రత్త వహించుట మేలు, కొంత మంది సలహాలు మీకు ఉపయోగ పడవచ్చు, ప్రయాణ సన్నాహాలు ఫలిస్తాయి.
|
![]() |
పూర్వపు బాకీలు తీర్చే అవకాశమున్నది, వ్యాపారము అభివృద్ధి కరముగా వుంటుంది, ఇంటికి సంబందించిన పనులను పూర్తిచేయగాలుగుతారు, ఉద్యోగులకు తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళే అవకాశమున్నది.
|
![]() |
మంచి సంపన్న కుటుంబాలతో పరిచయాలు ఏర్పడుతాయి, ధనము చేతికి అందుతుంది, కష్టము అయినా కొన్ని పనులను సాధించి తీరుతారు ఉద్యోగ లాభాలు వ్యపారలాభాలు వుంటాయి.మీలోని పట్టుదలను తగ్గనివ్వకండి, మివారే మీకు సహకరించుటకు అలొచిస్తాతారు.
|
![]() |
ఈ వారము అభివ్రుద్దికరముగా ఉండగలదు, అనుకొన్న పనులు నిరవేరుట శుభ కార్యక్రమమునకు సంబందించిన పనులు ముందుకు సాగుట, మిత్రుల సహకారము అందుట జరుగగలదు, శనివారము జాగ్రత్త వహించండి.
|
![]() |
వ్యాపారము లాభము బాట పట్టుతుంది, సమయానికి కావలసినవి అందుకొంటారు, బాకీలు వసూలుకాగాలవు, బ్యాంకు కు సంబందించిన విషయాలలో మద్యవర్తిత్వము వద్దు, ఉద్యోగులకు పని భారము పెరుగుతుంది.
|
![]() | ఈ వారము కొన్ని చిరాకులు మిమ్మలిని ఇబ్బంది గురిచేస్తాయి, ఇంటిలోని వారి వరుస [పద్ధతి] మీకు నచ్చదు, వ్యాపార బాగా స్వామ్యాన్ని కలుపు అవకాశమున్నది, కొన్ని విషయాలలో మీరు బోల్తా పడే అవకాసమిఉన్నది. |
![]() |
ఎదుట వ్యక్తి మాటకు విలువనిస్తారు, అనుకొన్న పనులు కొన్ని వాయిదా పడవచ్చు, నూతన వాహన సౌకర్యము కలుగవచ్చు, ఇంటిలోకి నూతన వస్తువుల రాకవుంటుంది, ఆడవారి కోరికలు మాటలు నెగ్గుతాయి.
|
![]() |
కొన్ని వ్యవహారాలు చక్క బెట్టడానికి కొంత సమయము అవసరము, తొందర నిర్ణయాలు మంచివికావు, ఆదివారము మరింత చిరాకులు ఉండవచ్చు, కొంతమంది మిత్రుల సహాయము అందుతుంది.
|
![]() |
ఒకరి మాటకు మీరు విలువ ఇవ్వక పోవుట వల్ల కొంత నష్టము తప్పదు, దూరపు చుట్టరికాలు మళ్ళి బలపడతాయి, డబ్బు విషయములో జాగ్రత్త వహించుట మేలు, ప్రయాణములో ఒక సమస్య కలుగ వచ్చు. ----------- చింతా గోపి శర్మ సిద్ధాంతి.
|
















